ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురిపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు

ABN, First Publish Date - 2021-10-19T05:02:43+05:30

కూతురిపై అత్యాచారం చేసిన ఓ తండ్రికి 20సంవత్సరాల జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ ఖమ్మం కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తీర్పు వెల్లడించిన ఖమ్మం కోర్టు

ఖమ్మంలీగల్‌, అక్టోబరు 18: కూతురిపై అత్యాచారం చేసిన ఓ తండ్రికి 20సంవత్సరాల జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ ఖమ్మం కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని బాలాజీకాలనీ బోడుఉప్పల్‌కు చెందిన ఓ వ్యక్తి (ప్రస్తుతం 47 సంవత్సరాలు) 2014 సమయంలో తన కన్న కూతురి (ప్రస్తుతం 22 ఏళ్లు)ని మానసికంగా, శారీరంగా ఇబ్బందులకు గురి చేశాడు. ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. దాంతో బాధితురాలు ఆ సమయంలో తన అమ్మమ్మ ఊరు అయిన భద్రాద్రికొత్తగూడెంజిల్లాలోని పాల్వంచ వచ్చింది. అయినా ఆమెను వదిలిపెట్టని తండ్రి పాల్వంచకు కూడా వచ్చి ఆమెను వేధించాడు. దీంతో విసిగిపోయిన ఆ కూతురు 2019లో తన తండ్రిపై పాల్వంచ పోలీసులకు ిఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో చార్జి షీట్‌ దాఖలు చేశారు. ఇక కూతురుపై అత్యాచారం చేసినట్లు రుజువవడంతో.. ఆ తండ్రికి 20సంవత్సరాలు జైలుశిక్ష, పదివేలు జరిమాన విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి పి.చంద్రశేఖర్‌ప్రసాద్‌  సోమవారం తీర్పు వెల్లడించారు.  

Updated Date - 2021-10-19T05:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising