ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్ర సమరయోధుడు సత్యనారాయణ మృతి

ABN, First Publish Date - 2021-10-20T04:09:03+05:30

మండల పరిధిలోని మాధారం గ్రామానికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తన్నీరు సత్యనారాయణ (104) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారేపల్లి అక్టోబరు 19: మండల పరిధిలోని మాధారం గ్రామానికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తన్నీరు సత్యనారాయణ (104) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందాడు. స్వాతంత్య్ర ఉద్యమంలో మహ్మగాంధీకి ఆయన మద్దతు తెలిపారు. అనంతరం రజాకార్లతో జరిగిన ఉద్యమంలో ఈప్రాంత ప్రజలతో మమేకమై పోరాటాలు చేస్తూ పలుమార్లు జైలుకి కుడా వెళ్లారని గ్రామానికి చెందిన వారు తెలిపారు. మాధారం గ్రామంలో విశాఖపట్నానికి చెందిన వారికి డొలమైట్‌  కోసం ప్రభుత్వం వెయ్యి ఎకరాల భూమి కేటాయించగా ఆ భూమికి సరైన ధర ఇప్పిండంతో పాటు భూమి ఇచ్చిన వారికి మైన్స్‌లో పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గాంధేయవాధిగా పేరున్న సత్యనారాయణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఖమ్మంలో ఉన్న అతడి కుమారుడి ఇంటివద్ద ఉంటున్న సత్యనారాయణ అక్కడే మృతిచెందడంతో భౌతికాయన్ని సొంత గ్రామం అయిన మాధారం తీసుకు వచ్చారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యారాములునాయక్‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌లో కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కాగా భౌతిక స్థానిక సర్పంచ్‌ అజ్మీర నరేష్‌, ఉప సర్పంచ్‌ బాగం వెంకటప్పారావుతో పాటు పలువురు గ్రామస్థులు నివాళ్లులర్పించారు.

Updated Date - 2021-10-20T04:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising