ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల గోడు పట్టించుకోని మంత్రి, అధికారులు: పువ్వాళ్ల

ABN, First Publish Date - 2021-05-20T05:49:02+05:30

ఖమ్మంజిల్లాలోని ధాన్యం రైతుల గోడును జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కానీ, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులెవరూ పట్టించుకోవడం లే దని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ విమర్శించారు.

రెబ్బవరంలోని కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలిస్తున్న దుర్గాప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, మే 19: ఖమ్మంజిల్లాలోని ధాన్యం రైతుల గోడును జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కానీ, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులెవరూ పట్టించుకోవడం లే దని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ విమర్శించారు. మండలంలోని రెబ్బవరం పలు గ్రామాల్లోని కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులను బుధవారం దుర్గాప్రసాద్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నా ధాన్యం కొనుగోళ్లు, ఎగుమతులు, లారీల కొరత వంటి సమస్యలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఫలితంగా జిల్లాలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేలకొండపల్లిలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని ఓ రైతు ఆత్మహత్యాప్రయత్నం చేసుకోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. తాలు ఇతర కారణాలు చూపుతూ మిల్లర్లు 7నుంచి 10కిలోల వరకు ధాన్యాన్ని కట్‌చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ దాసరి దానియేలు, వైరా సొసైటీ డైరెక్టర్‌ పసుపులేటి హ న్మంతరావు, నాయకులు గుత్తా రామారావు, వెంకటేశ్వర్లు, దేవరపల్లి వేణు, బ్రహ్మరాశి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-20T05:49:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising