ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంచె పనులను చేను విస్మరిస్తోంది

ABN, First Publish Date - 2021-03-09T05:52:22+05:30

అటవీశాఖ అధికారుల పర్యవేక్షణాలోపం కాంట్రాక్టర్లకు వరంగా మారుతోంది. సంబంధిత అధికారుల పట్టించుకోకపోవడంతో అడవుల్లో పనులు నాసికరంగా జరుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చర్ల మండలం సింగసముద్రం గుట్ట చుట్టూ నిర్మిస్తున్న పోల్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుట్టల చుట్టూ కంచె నిర్మాణంలో ఇష్టారాజ్యం

నాసిరకమైన సామగ్రి వినియోగిస్తున్న కాంట్రాక్టర్లు

చర్ల, మార్చి 8: అటవీశాఖ అధికారుల పర్యవేక్షణాలోపం కాంట్రాక్టర్లకు వరంగా మారుతోంది. సంబంధిత అధికారుల పట్టించుకోకపోవడంతో అడవుల్లో పనులు నాసికరంగా జరుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రూ.లక్షల అటవీశాఖ నగదు వృఽథా అవుతుండగా, లక్ష్యం నెరవేరడం లేదని స్థానికులు చెబుతున్నారు. చర్ల మడలంలోని గుట్టల చుట్టూ కంచె పనులు జరుగుతున్నాయి. కాగా ఈ పనులను సంబంధిత కొంత మంది కాంట్రాక్టర్లు నాసికరంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోతు లు తక్కువ లోతు తీసి, నాసిరకమైన ఇసుకతో పనులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొరవడిన పర్యవేక్షణ

మండలంలోని దోసిళ్లపల్లి, సింగసముద్రం, దేవానగరం, భూములంక, కలివేరు, జంగాలపల్లి లోని గుట్టల రక్షణలో భాగంగా కంచె నిర్మాణ పనులు జరుగుతున్న విష యం తెలిసిందే. ఇందుకోసం అటవీశాఖ రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. కాగా ఈపనుల్లో నాణ్యత కొరవడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంక్రీటు గొయ్యి లోతు తక్కువ తీయడం, పనుల్లో నాసికరం ఇసుక వాడుతుండటంతో కంచె ఎన్ని రోజులుంటుందో అధికారులకే తెలియలి. కంచె నిర్మాణంలో వేస్తున్న ఇసుప స్తంభాల్లో (తక్కువ ధర ఉన్న పోల్స్‌) కూడా నాణ్యత లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

విచారణ కు ఆదేశం

చర్ల మండలం గుట్టల చుట్టూ కంచె నిర్మాణానికి అభయారణ్యంలో ఇసుక తరలించారు. దీనిపై ‘ఇసుక.. దొడ్డి దారిన చక చకా’ శీర్షికన అనే కఽథనాన్ని సోమవారం ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీంతో జిల్లా అటవీశాఖ అధికారి లక్ష్మణ్‌ రంజిత్‌ నాయక్‌ స్పందించారు. అడవిలో ఇసుక తోలకాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని భద్రాచలం ఎఫ్‌డీవోను ఆదేశించారు. 


Updated Date - 2021-03-09T05:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising