ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాపరాలపల్లిలో దుప్పి మాంసం విక్రయం

ABN, First Publish Date - 2021-07-18T05:07:21+05:30

వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన దుప్పిని కూలీలు వాటాలు పంచుకొని ఇంటికి తీసుకెళ్లిన ఘటనపై ఒకరోజు ఆలస్యంగా కేసు నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొమ్మిది మంది కూలీలపై కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు

ఒకరోజు ఆలస్యంగా కేసు నమోదు చేయడంపై అనుమానాలు 

ములకలపల్లి, జులై 17: వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన దుప్పిని కూలీలు వాటాలు పంచుకొని ఇంటికి తీసుకెళ్లిన ఘటనపై ఒకరోజు ఆలస్యంగా కేసు నమోదైంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.   మండల పరిధిలోని చాపరాలపల్లి గ్రామ శివారులో శుక్రవారం కొంతమంది కూలీలు వరిపొలంలో నాటు వేస్తుండగా అటుగా ఓ దుప్పిని వీధి కుక్కలు తరుముకుంటూ వచ్చి దాడి చేశాయి. ఈ వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన దుప్పి కళేబారాన్ని కూలీలు తమ వెంట తీసుకెళ్లి మాంసాన్ని వాటాలుగా పంచుకొని ఇంటికి తీసుకెళ్లారు. అయితే వాటాల పంపకంలో విభేదాలు తలెత్తడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దాంతో కొందరు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఘటనలో అటవీశాఖ అధికారులకు, మాంసం విక్రయదారులకు మధ్య సయోధ్య కుదరకపోవడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం ఈ ఘటనలో 9మంది కూలీలపై అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల చట్టం కింద కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-07-18T05:07:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising