ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నలుగురు మళ్లీ తెలంగాణకు!

ABN, First Publish Date - 2021-10-19T05:00:13+05:30

భద్రాద్రితో అనుబంధం కలిగి ఉన్న ఆ నలుగురు వైద్యులు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ వైద్యశాఖ పరిధిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే ముగ్గురి దరఖాస్తు

అదేబాటలో మరొకరు..

భద్రాచలం, అక్టోబరు 18: భద్రాద్రితో అనుబంధం కలిగి ఉన్న ఆ నలుగురు వైద్యులు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ వైద్యశాఖ పరిధిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ముగ్గురు వైద్యులు వేర్వేరు కారణాలతో తెలంగాణ లోని భద్రాచలం వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. కాగా మరో వైద్యురాలు సైతం భద్రాచలం వచ్చేందుకు దరఖాస్తు చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కూనవరం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎంవీ కోటిరెడ్డి, గౌరీదేవిపేట, లక్ష్మీపురం వైద్యాధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పుల్లయ్య, స్వప్నికారెడ్డిలు తెలంగాణలో తాము పని చేయాలని ఆసక్తిగా ఉన్నామని ఇందు కోసం భద్రాచలం వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే తూర్పుగోదావరి జి ల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,  వారు దరఖాస్తు చేశారు.  కాగా మరో వైద్యురా లు కవిత సైతం భద్రాచలం వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.  వీరు నలుగురు తెలంగాణలోని భద్రాచలం వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న క్రమంలో ఇందుకు సంబంధించి అధికారిక ఆమోద ముద్ర లభించాల్సి ఉంది. ఇదిలా ఉండగా 2019 సెప్టెంబరు 15న ఈ వైద్యులు ఏపీకి బదలాయించడం జరిగింది. ఈ క్రమంలో మళ్లీ వారు తిరిగి భద్రాచలంలో వైద్యులుగా బాధ్యతలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. డాక్టర్‌ ఎంవి కోటిరెడ్డి  గతంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించగా, డాక్టర్‌ పుల్లయ్య డి ప్యుటీ, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌వోగా బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా డాక్టర్‌ స్వప్నికారెడ్డి నర్సాపురం పీహెచ్‌సీ వైద్యురాలిగా, డాక్టర్‌ కవిత భద్రాచలం ఏరియా వైద్యశాల వైద్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 


Updated Date - 2021-10-19T05:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising