ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరిసాగుపై ఆంక్షలు వద్దు

ABN, First Publish Date - 2021-10-29T05:39:03+05:30

రాష్ట్రంలో వరిసాగు వద్దని, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్‌అండ్‌బీ విశ్రాంతిగృహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఖమ్మంలో బీజేపీ ఆందోళన

 ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నంలో అరెస్టు

ఖమ్మం,అక్టోబరు 28(ప్రతినిధి): రాష్ట్రంలో వరిసాగు వద్దని, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్‌అండ్‌బీ విశ్రాంతిగృహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్‌తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టచేసి ఆ తర్వాత వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల చేశారు. రైతుల పక్షాన భారతీయ జనతాపార్టీ అండగా ఉంటుం దని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని కొన్ని జిల్లాల కలెక్టర్లకూడా రైతులకు వరివిత్తనాలు సరఫరా చేస్తే షాపులపై కేసులు నమోదుచేస్తామంటూ  ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వరిసాగుచేస్తే ఉరితప్పదంటూ ప్రచారం నిర్వహించడం, ఇటువంటి చర్యలు బాధకరమన్నారు. వరి రైతులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.  

Updated Date - 2021-10-29T05:39:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising