ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2025 నాటికి క్షయ రహిత జిల్లాగా భద్రాద్రి

ABN, First Publish Date - 2021-03-25T04:09:36+05:30

వైద్య సిబ్బంది సమిష్టిగా కృషి చేసి 2025 నాటికి జిల్లాలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించి క్షయ రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమావేశంలో డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, మార్చి 24: వైద్య సిబ్బంది సమిష్టిగా కృషి చేసి 2025 నాటికి జిల్లాలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించి క్షయ రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. ప్రపం చ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక అంబేద్కర్‌ హాలులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  అధ్యక్షతన స మావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. క్షయవ్యాధి ప్రొగ్రాంలో పనిచేస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. క్షయ వ్యాధిని నియంత్రించడంలో జాతీ య స్థాయిలో అవార్డు సాధించినందుకు టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ను అభినందించారు. ఉత్తమ సేవలందిం చినందుకు సర్టిఫికెట్‌ ప్రధానం చేశారు. వచ్చిన గుర్తింపును నిలుపుకోవడానికి సిబ్బంది అంకితభావంతో పనిచేసి 2025 నాటికి జిల్లాలో క్షయవ్యాది లేకుండా తరిమికొట్టాలన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆయన కోరారు. సిబ్బంది అందరూ అంకిత భావంతో పని చేయాలన్నారు. వైద్య శాఖలోని అన్ని విభాగాల్లో సిబ్బంది సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి డాక్టర్‌ పోటు వినోద్‌, డాక్టర్‌ సంజీవరావు, డాక్టర్‌ సుదీర్‌, డాక్టర్‌ మౌనిక, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-03-25T04:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising