ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డంపింగ్‌యార్డును తరలించాలని ధర్నా

ABN, First Publish Date - 2021-07-26T05:36:50+05:30

డంపింగ్‌యార్డు తరలిం చాలంటూ ఆదివారం కామంచికల్‌ గ్రామస్థులు డంపింగ్‌ యార్డుకు వెళ్లే రహదారిలో వద్ద ధర్నా నిర్వహించారు.

కామంచికల్‌లో ధర్నా నిర్వహిస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రఘునాథపాలెం, జూలై25: డంపింగ్‌యార్డు తరలిం చాలంటూ ఆదివారం కామంచికల్‌ గ్రామస్థులు డంపింగ్‌ యార్డుకు వెళ్లే రహదారిలో వద్ద ధర్నా నిర్వహించారు. ఖమ్మం నగరంలోని చెత్తను మల్లెమడుగులో ఉన్న డంపింగ్‌యార్డుకు తరలించాలి, కానీ చెత్త ట్రాక్టర్ల డ్రైవర్లు కామంచికల్‌ రహదారివెంట, రైతుల పంటపొలాల్లోనే పడేసి వెల్తున్నారు. ఈక్రమంలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాలను, జంతు కలేబరాలను సైతం రోడ్ల వెంబడి, పంటపొలాల్లో పడేయటం పరిపాటిగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. కళేబరాల నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారన్నారు. రైతులు వ్యవసాయం చేసుకునే వీలులేకుండా సిబ్బంది ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటంలేదని ప్రజలు అంటున్నారు. ఈదర్నా కార్యక్రమానికి రూరల్‌ జడ్పీటీసీ వరప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండలపార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, సీపీఎం మండల కార్యదర్శి నవీన్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ప్రభాకర్‌, మేదరమెట్ల శ్రీనివాసరావు, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, చింతల రమేష్‌, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-26T05:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising