ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పినపాక, కరకగూడెం మండలాలకు మహర్దశ

ABN, First Publish Date - 2021-03-25T05:13:18+05:30

పినపాక నియోజకవర్గంలోని పూర్తి ఏజెన్సీ మండలాలైన పినపాక కరకగూడెం మండలాల అభివృద్ధి పనులకు మహర్దశ పట్టనుంది. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు కృషితో ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న పలు అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విప్‌ రేగా కాంతారావు కృషితో నిధులు మంజూరు

 పినపాక, మార్చి 24 : పినపాక నియోజకవర్గంలోని పూర్తి  ఏజెన్సీ మండలాలైన పినపాక కరకగూడెం మండలాల అభివృద్ధి పనులకు మహర్దశ పట్టనుంది. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు కృషితో ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న పలు అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ‘ఆంధ్రజ్యోతి’తో బుధవారం ఆయన ఫోన్‌లో సంభాషించారు. ఈ రెండు మండలాల్లో దాదాపు రూ,6 కోట్ల 17.4 లక్షల అభివృద్ధి పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలిచి, ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో నిధులు మంజూరైన పనుల వివరాలను వెల్లడించారు. పినపాక మండలం బోటిగూడెం పంచాయతీ మారేడుగూడెం బ్రిడ్జి నిర్మాణానికి రూ, 30 లక్షలు , బయ్యారం - బెస్తగూడెం రహదారి పనులకు రూ, 3 కోట్ల 11 లక్షలు, కరకగూడెం మండలంలోని ముంకుటి వర్రెకు రూ.1 కోటి 24 లక్షలు, వట్టివాగుపై రూ.2 కోట్ల 52 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏజెన్సీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. త్వరలోనే పనులన్నింటికి టెండర్లు పిలవడం జరుగుతుందని, ఏప్రిల్‌ 15 తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-03-25T05:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising