ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో మునిగి బాలిక, యువతి మృతి

ABN, First Publish Date - 2021-05-08T05:05:18+05:30

భద్రాచలం వద్ద గోదావరిలో ము నిగి శుక్రవారం స్థానిక అశోకనగర్‌ కాలనీకి చెందిన ఓ బాలిక, ఓ యువతి మృతి చెందారు.

గల్లంతైనవారికోసం గాలిస్తున్న పోలీసులు, అగ్నిమపక సిబ్బంది,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుస్తులు ఉతికేందుకు వెళ్లగా ప్రమాదం

ఇన్‌టేక్‌వెల్‌ సమీపంలో ఘటన

భద్రాచలం, మే 7: భద్రాచలం వద్ద గోదావరిలో ము నిగి శుక్రవారం స్థానిక అశోకనగర్‌ కాలనీకి చెందిన ఓ బాలిక, ఓ యువతి మృతి చెందారు. కాలనీకి చెందిన బాలరాజు-రాణిల కూతురు చింతల ప్రవల్లిక(20), యడ్ల యేసు, స్వాతిల కుమార్తె మధులత(15) వరుసకు వదినా మరదళ్లు కాగా మధుల తల్లి స్వాతితో కలిసి వారిద్దరూ గోదావరిలోని ఇన్‌టేక్‌వెల్‌ సమీపంలో దుస్తు లు ఉతికేందుకు శుక్రవారం మధ్యాహ్నం వెళ్లారు. ఈ క్రమంలో దుస్తులు ఉతికిన అనంతరం ఇద్దరు బాలికలు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి లోతును అంచనా వేయలేక గల్లంతయ్యారు. పిల్లలు గల్లంతైన విషయం చూసిన స్వాతి గట్టిగా  కేకలు వేయడంతో స్థానిక జాల ర్లు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా ప్రవళ్లిక, మధులతల మృతదేహాలు లభించాయి. ఘటనపై భద్రాచలం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

49 రోజుల్లో అదేచోట ఆరుగురు మృతి

భద్రాచలంలోని గోదావరి ఇన్‌టేక్‌వెల్‌ సమీపంలో గత 49 రోజుల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాద ఘటనల్లో ఆరు గురు మృతి చెందడం గమనార్హం. మార్చి 19న అయ్యప్పకాలనీకి చెందిన నలుగురు మృతి చెందగా అదేచోట శుక్రవారం ఇద్దరు దుస్తులు ఉతికేందుకు వెళ్లి మృత్యువాత పడటం స్థానికులను కలచివేస్తోంది. ఇదిలా ఉండగా భద్రాచలం వద్ద గోదావరిలో 2014నుంచి ఇప్పటి వరకు 35 మంది మృతి చెందడటం బాధాకరం.  

హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు

గోదావరి ఇన్‌టేక్‌వెల్‌ సమీపంలో లోతు ఉందని హె చ్చరిక బోర్డులు లేకపోవడంతో అశోకనగర్‌ కాలనీ, అ య్యప్పకాలనీకి చెందిన వారు అక్కడికి దుస్తులు ఉ తికేందుకు వెళ్లి స్నానానినికి నదిలోకి దిగి ప్రమాదాల బా రినపడుతున్నారు. గతంలో ప్రమాదం జరిగిన స మయంలోనే హెచ్చరిక బోర్డులు లేవని విమర్శలు వ చ్చినా అధికార యంత్రాంగం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తు న్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని భద్రాద్రివాసులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-08T05:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising