ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ జాగ్రత్తలతో హాస్టల్‌ వసతి

ABN, First Publish Date - 2021-06-23T05:01:23+05:30

కొవిడ్‌ పూర్తి స్థాయి జాగ్రత్తలతో ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతిగృహలు సిద్ధం చేయాలని, మరో పదిరోజుల్లో హాస్టల్స్‌ ప్రారంభిం చాలని సాంఘీక సంక్షేమశాఖ డీడీ కస్తాల సత్యనారాయణ ఆదేశించారు.

మాట్లాడుతున్న డీడీ కస్తాల సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 2500 మంది విద్యార్థులకి అడ్మిషన్‌ కల్పించాలి

సంక్షేమాధికారులకు డీడీ కస్తాల ఆదేశాలు 

ఖమ్మంసంక్షేమవిభాగం, జూన్‌ 22: కొవిడ్‌ పూర్తి స్థాయి జాగ్రత్తలతో ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతిగృహలు సిద్ధం చేయాలని, మరో పదిరోజుల్లో హాస్టల్స్‌ ప్రారంభిం చాలని సాంఘీక సంక్షేమశాఖ డీడీ కస్తాల సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం ఖమ్మంలోని అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సంక్షేమాధికారుల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.2021 విద్యా సంవత్సరం లో 39 ఎస్సీహాస్టల్స్‌లో 2500 మంది విద్యార్థులకు నూతనంగా ఆడ్మిషన్‌ కల్పించాలని చెప్పారు. హాస్టల్స్‌ మరమ్మతులు, శానిటేషన్‌ నిర్వహించాలని, విద్యుత్‌, తాగు నీరు, విద్యార్థులు భౌతికదూరం సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామాల్లో సంక్షేమాధికారులు పర్యటించి నూతన ఆడ్మిషన్లపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగా హన కల్పించాలన్నారు. కాలేజీ హాస్టల్స్‌పై గ్రామాల్లో ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. అలాగే సాంఘీక సంక్షేమ విద్యా పథకాలపై గ్రామాల్లో విద్యార్థులకు తెలియజేయాలన్నారు. కార్పొరేట్‌ కాలేజీ, విదేశీ విద్య, లాయర్ల ఉన్నత విద్య ఉచిత పథకాలపై ప్రతీ నెల ఒక రోజు కేటాయించి గ్రామాలకు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఏఎస్‌డ బ్ల్యూవోలు శ్రీలత, లక్ష్మీనారాయణ, కొత్తా వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్‌ మురళి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising