ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాములు నాయక్‌ గెలుపు తథ్యం

ABN, First Publish Date - 2021-02-24T04:10:46+05:30

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి సపావట్‌ రాములు నాయక్‌ గెలుపు ఖాయమని డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ధీమా వ్యక్తం చేశారు.

మాట్లాడుతున్న పొదెం వీరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య

 కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, ఫిబ్రవరి 23 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి సపావట్‌ రాములు నాయక్‌  గెలుపు ఖాయమని డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన రాములు నాయక్‌ను ఎమ్మెల్సీగా గెలిపించే బా ధ్యత జిల్లాలోని పట్టభద్రులకు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉందని స్పష్టం చేశారు. తొలిసారిగా రాష్ట్రంలో ఒక గిరిజన అభ్యర్ధికి ఎమ్మెల్సీ సీటును కేటాయించి కాంగ్రెస్‌ అధిష్ఠానం సాహసోపేత నిర్ణయం తీసుకుందని తెలుపుతూ... ఆ నిర్ణయాన్ని భద్రాద్రి జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ నెల 25న కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించే సన్నాహక సమావేశానికి పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లుభట్టి విక్రమార్క హాజరు కానున్నట్టు వివరాలు వెల్లడించారు. ఈ సమావేశాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలు, అభిమా నులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. 


Updated Date - 2021-02-24T04:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising