ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో కూలి దుర్మరణం

ABN, First Publish Date - 2021-01-06T04:05:32+05:30

విద్యుదాఘాతంతో విద్యుత్‌ శాఖలో దినసరి కూలి మృతి చెందాడు. ఈ ఘటన సంఘటన మంగళవారం మఽధ్యాహ్నం మండల పరిధిలోని భైరవునిపల్లిలో జరిగింది.

రాజశేఖర్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేలకొండపల్లి మండలంలో ఘటన 

నేలకొండపల్లి, జనవరి5: విద్యుదాఘాతంతో విద్యుత్‌ శాఖలో దినసరి కూలి మృతి చెందాడు. ఈ ఘటన  సంఘటన మంగళవారం మఽధ్యాహ్నం మండల పరిధిలోని భైరవునిపల్లిలో జరిగింది. కోనాయగూడేనికి చెందిన పసుపులేటి రాజశేఖర్‌ 2013 నుంచి విద్యుత్‌ శాఖలో డైలీవేజ్‌పై(అన్‌మ్యాన్‌గా) పని చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం భైరవునిపల్లికి చెందిన మరికంటి ఉపేందర్‌ అనే రైతు ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫీజు వేయటానికి తీసుకెళ్లాడు. ఫీజు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ సరఫరా జరిగింది. దీంతో రాజశేఖర్‌(28) విద్యుత్‌ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య , ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న విద్యుత్‌ ఉన్నతాధికారులు ఏడి కోటేశ్వరరావు, ఏఈ భోజ్యానాయక్‌, పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిస్తుండగా నేలకొండపల్లి బౌద్దస్ధూపం వద్ద మృతుడి బంధువులు అడ్డుకున్నారు. తిరిగి ప్రమాదం జరిగిన చోటకు తీసుకెళ్లారు. సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించటం ఏమిటంటూ పోలీసులను నిలదీశారు. రైతు నష్ట పరిహారం ఇవ్వాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-01-06T04:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising