ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25డివిజన్లలో పోటీకి సీపీఎం నిర్ణయం

ABN, First Publish Date - 2021-04-17T06:17:55+05:30

25డివిజన్లలో పోటీకి సీపీఎం నిర్ణయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం మయూరిసెంటర్‌, ఏప్రిల్‌ 16: టీఆర్‌ఎస్‌తో సీపీఎంకు పొత్తు ఉంటుందని అందరూ భావించినా.. ఆ పార్టీ మాత్రం ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో 25డివిజన్లలోపోటీ చేయాలని నిర్ణ యించుకుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆ పార్టీ జిల్లా కమి టీ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లతో పొత్తుల విషయమై ప్రతిపాదన వచ్చినా.. సీపీఎం మాత్రం 25డివిజన్లలోనామినేషన్లు వేయాలని, ఆదివారం నాటికి తమతో కలిసి వచ్చే పార్టీలతో సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈక్రమంలో  కాంగ్రెస్‌, టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకుని, సీపీఎం పోటీ చేసే కాంగ్రెస్‌, టీడీపీ, ఈ రెండూ బరిలో ఉన్న డివిజన్లలో సీపీఎం పోటీకి దూరంగా ఉండేలా ఓ ఒప్పందానికి రానున్నట్టు తెలు స్తోంది. ఈ క్రమంలో టీడీపీ 13డివిజన్లలో పోటీ చేయనుంది.

టీఆర్‌ఎస్‌తో ఐదు సీట్లకు సీపీఐ ప్రతిపాదన..

సీపీఐ టీఆర్‌ఎస్‌తో దోస్తీ చేసే క్రమంలో తము ఐదు డివిజన్లు కేటాయించాలన్న ప్రతిపాదనను మంత్రి అజయ్‌కుమార్‌ ముందుంచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి కూడా ఐదు డివిజన్లను సీపీఐకి ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో తమకు పట్టున్న డివిజన్లను కేటాయించాలని సీపీఐ నాయకులు మంత్రిని కోరగా.. శనివారం సీపీఐ, టీఆర్‌ఎస్‌ల మధ్య జరిగే చర్చల తర్వాత ఓ స్పష్టత రానుంది. 

Updated Date - 2021-04-17T06:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising