ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ దినదిన గండం.. ప్రతి రోజు వ్యాక్సిన్‌ కోసం హైదరాబాద్‌కు వాహనం

ABN, First Publish Date - 2021-04-21T06:10:56+05:30

గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ దినదిన గండంగా మారింది. ప్రతి రోజు సాయంత్రం హైదరాబాద్‌కు ఒక వాహనం వెళ్లటం అక్కడ తెల్లవారుజామున కొద్దిపాటి డోసులు ఇవ్వటం వాటిని అప్పటికప్పుడు తీసుకొచ్చి పంపిణీ చేయటం జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం సంక్షేమవిభాగం/కొత్తగూడెం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 20: గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ దినదిన గండంగా మారింది. ప్రతి రోజు సాయంత్రం హైదరాబాద్‌కు ఒక వాహనం వెళ్లటం అక్కడ తెల్లవారుజామున కొద్దిపాటి డోసులు ఇవ్వటం వాటిని అప్పటికప్పుడు తీసుకొచ్చి పంపిణీ చేయటం జరుగుతోంది. దీంతో ఏ వ్యాక్సినేషన్‌ కేంద్రానికి ఏ రకం వ్యాక్సిన్‌ ఎన్ని డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలో శీతలీకరణ గిడ్డంగుల్లో లక్ష డోసుల కరోనా వ్యాక్సినేషన్‌ను ఉంచేందుకు అవకాశం ఉన్నా కావాల్సినంత వ్యాక్సిన్‌ మాత్రం జిల్లాకు రావడం లేదు. భద్రాద్రి జిల్లాకు కూడా వ్యాక్సిన్‌ అరకొరగానే సరఫరా అవుతోంది. మంగళవారం 4,750 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని టార్గెట్‌ నిర్ణయించగా కొన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్‌ స్టాక్‌లేదని తిప్పి పంపారు. నేటి రాత్రికి జిల్లాకు వ్యాక్సిన్‌ దిగుమతి అవుతుందని, రేపటి నుంచి సమృద్ధిగా వ్యాక్సిన్‌ అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 


Updated Date - 2021-04-21T06:10:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising