ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులే భయపడుతున్నారంటే...

ABN, First Publish Date - 2021-06-23T04:52:26+05:30

అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి అధికారులే భయపడుతు న్నారంటే... మీరు చాలా శక్తిమంతులై ఉంటారు? ఈ కేసును మేం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఘాటు వ్యాఖ్య లు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు శక్తిమంతులై ఉంటారు

ఈ కేసును మేమే పర్యవేక్షిస్తాం 

అక్రమ భవంతిపై కేసులో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి అధికారులే భయపడుతు న్నారంటే... మీరు చాలా శక్తిమంతులై ఉంటారు? ఈ కేసును మేం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఘాటు వ్యాఖ్య లు చేసింది. అక్రమ నిర్మాణంపై జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్రమ భవనం కూల్చివేతకు నోటీసులు ఇచ్చిన వారం రోజుల తర్వాత చర్యలు చేపట్ట వచ్చని స్పష్టం చేసింది. చుంచుపల్లి మండలం, విద్యానగర్‌ గ్రామంలో వి. గోపాల్‌రావు అనే వ్యక్తి ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమంగా బహుళ అంతస్తుల భవనం కడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు అక్రమ నిర్మాణం కూల్చివేతకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై గోపాల్‌రావు మదన్‌మోహన్‌ అనే న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తర్వాత ఆయనపై దౌర్జన్యం చేసి ఎన్‌ఓసీ తీసుకుని మరో న్యాయవాది ద్వారా వకాలత్‌ వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది మదన్‌మోహన్‌ కోర్టుకు ఫిర్యాదు చేస్తూ... గోపాల్‌రావు తన కార్యాలయంలోకి చొచ్చుకువచ్చి ఎన్‌ఓసీ ఇవ్వాలని బెదిరించి తీసుకున్నారని కోర్టుకు చెప్పారు. కోర్టుకు హాజరైన పంచాయతీ అధికారి అక్రమ భవనంపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని, పిటిషనర్‌కు అండగా రాజకీయ నాయకులు ఉన్నారని కోర్టులో చెప్పారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి పిటిషన్‌ను కొట్టివేసారు. దీనిపై గోపాల్‌ రావు డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం... పిటిషనర్‌ చాలా శక్తిమంతుడు, రాజకీయ నాయకుల అండదండలున్నందున దీనిని తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేస్తూ తుపరి విచారణ ను జూన్‌ 29కి వాయిదా వేసింది.  


Updated Date - 2021-06-23T04:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising