ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 837 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2021-05-12T05:32:45+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం కొత్తగా 837మంది కరోనా బారినపడ్డారు. ఖమ్మం జిల్లాలో 1500మందికి పరీక్షలు నిర్వహించగా 536మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. భ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఖమ్మం సంక్షేమ విభాగం/కొత్తగూడెం కలెక్టరేట్‌, మే 11 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం కొత్తగా 837మంది కరోనా బారినపడ్డారు. ఖమ్మం జిల్లాలో 1500మందికి పరీక్షలు నిర్వహించగా 536మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,858 మందికి పరీక్షలు నిర్వహించగా 301 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లాలో మంగళవారం మొత్తం 4,300 మందికి వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంకాగా 3,876 మంది వ్యాక్సిన్‌ తీసుకొన్నారు. భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌లో ఓ మహిళ కొవిడ్‌తో మృతి చెందింది. గత పది రోజులుగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఆమె మంగళవారం మధ్యాహ్యం 3 గంటల సమయంలో మృతి చెందింది.  

భద్రాద్రి డిప్యుటీ డీఎంఅండ్‌హెచ్‌వోకు కరోనా పాజిటివ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యఆరోగ్యశాఖ భద్రాచలం డిప్యుటీ డీఎంఅండ్‌హెచ్‌వో, మలేరియా జిల్లా ప్రోగ్రామింగ్‌ అధికారి మోకాళ్ల వెంకటేశ్వరరావుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం అశ్వాపురం వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్‌గా ఖరారు అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. గత కొన్ని రోజులుగా భద్రాచలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటనలు చేయడంతో పాటు జ్వర పీడితులను పరీక్షించిన క్రమంలో ఆయన బారిన పడినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-05-12T05:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising