ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయశక్తి

ABN, First Publish Date - 2021-03-08T05:22:01+05:30

ప్రస్తుత రాజకీయపరిస్థితుల్లో దేశంలో ప్రత్యామ్నాయశక్తి కమ్యూనిస్టులేనని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఎర్రజెండాకే ఉందని సీపీఐ రాష్ట్ర నాయకుడు కూనంనేని సాంబశివరావు అన్నారు.

పార్టీలో చేరినవారితో సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతకాని మార్చి7: ప్రస్తుత రాజకీయపరిస్థితుల్లో దేశంలో ప్రత్యామ్నాయశక్తి కమ్యూనిస్టులేనని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఎర్రజెండాకే ఉందని సీపీఐ రాష్ట్ర నాయకుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పలు కుటుంబాలు కూనంనేని సమక్షంలో సీపీఐలో చేరాయి. సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను టీఆర్‌ఎస్‌ పార్టీ మోసం చేసిం దన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కలగానే మిగిలిపోయిందని, ఉద్యోగ భృతి కరువైందన్నారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు.ప్రజా సమస్యలపైన పోరాడే కమ్యూనిస్టులతో ప్రజలు కలసిరావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పోటు ప్రసాద్‌, జమ్ముల జితేందర్‌రెడ్డి,కొండపర్తి గోవిందరావు,  రవీంద్రబాబు, మండల నాయకులు పావులూరి మల్లికార్జున్‌, రాసాల మోహనరావు, కన్నెబోయిన విజయమ్మ, కూచిపుడి రవి,దూసరి గోపాలరావు,సర్పంచ్‌లు రాసాల సాంబలక్ష్మీ, నకనబోయిన సుజాత, ఎంపీటీసీ మార్గోం కొరివీరమ్మ పాల్గొన్నారు.


Updated Date - 2021-03-08T05:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising