ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ పిల్లలను ఇటువంటి పరిసరాల్లో ఉంచుతారా

ABN, First Publish Date - 2021-01-20T04:20:23+05:30

మీ పిల్లలు అయితే ఇటు వంటి వాతావరణంలో, ఇటు వంటి పరిసరాల్లో ఉంచుతారా అని సాంఘిక సంక్షేమ గురు కుల కళాశాల ప్రిన్సిపాల్‌పై కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆగ్రహం వ్య క్తం చేశారు.

ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళాశాల ప్రిన్సిపాల్‌పై కలెక్టర్‌ ఆగ్రహం 

పాల్వంచ రూరల్‌, జనవరి 19: మీ పిల్లలు అయితే ఇటు వంటి వాతావరణంలో, ఇటు వంటి పరిసరాల్లో ఉంచుతారా అని  సాంఘిక సంక్షేమ గురు కుల కళాశాల ప్రిన్సిపాల్‌పై కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆగ్రహం వ్య క్తం చేశారు. ఫిబ్రవరి 1 నుండి పాఠశాలలు, కళాశాలల్లో తరగ తులు ప్రారంభం కానున్న నేప ధ్యంలో కలెక్టర్‌ మంగళ వారం పాల్వంచ మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయ తీలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా తరగతి గదులను, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులు ఆరుబయట స్నానం చేయడం, బక్కెట్లతో నీరు తీసుకుని బాత్రూ మ్‌లకు వెళ్ళడం తదితర విషయాలను తెలుసుకుని కళాశాల ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఏమి చేశారని, సౌకర్యాలు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఈ విషయాలపై, ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యంపై సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శికి లేఖ రాస్తా నన్నారు. అనంతరం వంటగదిని, విద్యార్ధులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అన్నం ఉడకకపోవడం, సమయానికి విద్యార్ధులకు మధ్యాహ్న బోజనం ఏర్పాటు చేయక పోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీ పిల్లల విషయంలో ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ను ఆదేశించారు. 


Updated Date - 2021-01-20T04:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising