ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హై రిస్క్‌ వారియర్స్‌ వ్యాక్సిన్‌ వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2021-06-17T05:28:47+05:30

జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యలో భాగంగా నిర్వహిస్తున్న హైరిస్క్‌ వారి యర్స్‌కు వేస్తున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వైద్య, మున్సిపల్‌, పంచాయతీ అధికారులను కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, జూన్‌ 16: జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యలో భాగంగా నిర్వహిస్తున్న హైరిస్క్‌ వారి యర్స్‌కు వేస్తున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వైద్య, మున్సిపల్‌, పంచాయతీ  అధికారులను కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో వ్యాక్సినేషన్‌, డివైడర్ల నిర్మాణం, పారిశుధ్య కార్యక్రమాలు, వార్డులో ట్రీ పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ ప్రక్రి యను వేగవతం చేసేందుకు ఆదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. వ్యాక్సి నేషన్‌  కొర త లేదని గుర్తింపు చేసిన హైరిస్క్‌ వారియర్స్‌ ప్రతి ఒక్క రికి వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నారు. అవసరమైతే అదనపు కౌం టర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 12 కేటగిరిలకు వ్యాక్సినేషన్‌ ప్రతి రోజు నివేదికలు అందజేయాలన్నారు. జిల్లా ఆరోగ్య పరిరక్షణకు పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలన్నారు. అంటు వ్యాధుల నివారణకు ముగురునీరు నిల్వలు లేకుండా, పిచ్చిమొక్కలు లేకుండా చేయాలన్నారు. పారిశుద్య కార్యక్రమాలు నిర్వహాణకు యంత్రాల వినియోగం చేపట్టాలన్నారు. రోడ్డు ఇరువైపులా మల్టీపర్సస్‌ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు లేని రోడ్డు ఉండటానికి వీల్లేదన్నారు. పల్లెలోనూనా, పట్టణం లోనైనా రోడ్డు కిరువైపులా మల్టీ పర్పస్‌ మొక్కలు నాటా లన్నారు. పట్టణాల్లో జరుగుతున్న డివైడర్ల నిర్మాణాల్లో జంక్షన్లను అందంగా తీర్చిదిద్దే చర్యలు 5రోజుల్లో పూ ర్తిచేయాలన్నారు. రహదారుల వెంబడి ఉన్న ఆక్రమణ లను తొలగించాలని ఆదేశించారు. రహదారుల వెంట వ్య ర్ధాలు తొలగించడానికి గడ్డికోయు యంత్రాలను వినియో గించాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రభలే అవకాశాలున్నాయాని, పారిశుధ్య కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. సమీకృత కలెక్టరేట్‌ ప్రాంగణంలో అందమైన  మల్టీ పర్పస్‌ మొక్కలు నాటాలన్నారు. సీసీ రోడ్లుకు ఇరువైపులా జాగ్రత్తగా డ్రిల్‌ వేసి మొక్కలు నాటాలన్నారు. 


Updated Date - 2021-06-17T05:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising