ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరుణా హృదయుడు

ABN, First Publish Date - 2021-05-15T05:52:08+05:30

ఓ గర్భిణి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతుండటంతో టు టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పక్టర్‌ కరుణాకర్‌ స్పందించారు.

గర్భిణిని ఆటోలో ఇంటికి పంపుతున్న సీఐ కరుణాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మానవత్వం చాటిన టు టౌన్‌  సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌

 ఆసుపత్రికి వచ్చిన గర్భిణిని సొంత ఖర్చుతో ఇంటికి పంపిన పోలీస్‌

ఖమ్మం క్రైం, మే 14: ఓ గర్భిణి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతుండటంతో టు టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పక్టర్‌ కరుణాకర్‌ స్పందించారు. సొంత ఖర్చుతో ఆమెను ఆటోలో ఇంటికి పంపి మానవత్వాన్ని చాటుకు న్నారు. చింతకాని మండలం ముష్టికుంట గ్రామానికి చెంది న శైలజ తొమ్మిది నెలల గర్భిణి. ఆసుపత్రిలో చూపించు కునేందుకు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఇల్లెందు క్రాస్‌ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తన తల్లితో కలిసి శుక్రవారం ఉదయం వచ్చారు.ఆసుపత్రిలో చూపించుకునే సరికి మధ్యాహ్నం అయింది.  లాక్‌డౌన్‌ కావడంతో ఇంటికి వెళ్లేందుకు వాహనాలు ఏమీ లేవు. దీంతో రోడ్డుపై ఎండలో గంటన్నర పాటు నిల్చున్నారు. ఆప్రాంతంలోనే విధుల్లో ఉన్న టు టౌన్‌ సీఐ కరుణాకర్‌ వారిని గమనించి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే చెక్‌పోస్టు వద్ద ఉన్న టెంటు కింద కూర్చోపెట్టారు. కొద్ది సేపటి తర్వాత ఓఆటో డ్రైవర్‌ను పిలిచి వారిని ఆటో ఎక్కించారు. వారివద్ద డబ్బులు తీసుకోవద్దని చెప్పి సీఐ ఆ డ్రైవర్‌కు సొంతంగా  కిరాయి డబ్బులు ఇచ్చి పంపారు. ‘అయ్యా మీకు దండం..’ అంటు ఆ గర్భిణి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఇది చూసిన సిబ్బంది సీఐకి సెల్యూట్‌ చేసి అభినందించారు.


Updated Date - 2021-05-15T05:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising