ఒక్క సీసీ కెమెరా వెయ్యినేత్రాలతో సమానం: ఏసీపీ
ABN, First Publish Date - 2021-02-09T04:56:17+05:30
ఒక్క సీసీ కెమెరా వెయ్యి కళ్లతో సమానమని ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి అన్నారు.
సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న ఏసీపీ వెంకటరెడ్డి
ముదిగొండ, ఫిబ్రవరి 8: ఒక్క సీసీ కెమెరా వెయ్యి కళ్లతో సమానమని ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గంధసిరి గ్రామంలో ఏర్పాటుచేసిన 8సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని, ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాల నిర్మూలనకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐ తాండ్ర నరేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - 2021-02-09T04:56:17+05:30 IST