ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడిలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-09-18T06:08:13+05:30

బడిలో కరోనా కలకలం

కొడవటంచ పాఠశాలలో విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధ్యాయుడు, విద్యార్థినికి కరోనా

గుండాల, సెప్టెంబరు 17: ఎన్నో జాగ్రత్తల మధ్య పాఠశా లల ప్రారంభించి.. తరగతులు నిర్వహిస్తుండగా.. కరోనా మహ మ్మారి మాత్రం ‘బడి’గంట కొడు తూనే ఉంది. పాఠశాలలు ప్రా రంభించిన నాటి నుంచి భద్రాద్రి జిల్లాలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కరోనా రావ డంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా.. గుండాల మం డలంలోని కొడవటంచ ప్రాథమి కోన్నత పాఠశాల ప్రధానోపాఽధ్యాయుడు గురువారం జ్వరంతోనే పాఠశాలకు వచ్చారు. జ్వరం తీవ్రం కావడంతో గుండాల సీహెచ్‌సీలో కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన గుండాల ఎంఈవో పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో పీహెచ్‌సీ వైద్యుడు మున్వర్‌ అలీ శుక్రవారం పాఠశాల విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అలాగే ఇదే మండలం మామకన్ను ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలో ఓ రెండో తరగతి విద్యార్థినికి కరోనా రావడంతో పాఠశాలలో శానిటైజేషన్‌ చేయించారు. అయినా తల్లి దండ్రులు తీవ్ర భయాం దోళనకు గురవుతు న్నారు. ఓవైపు కొవిడ్‌ భయం మరో వైపు తరగతు లకు హాజరు కాకపోతే చదువులో వెనకబడి పోతారే మోనని ఆందోళన మధ్య చదువులు సాగుతున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో 20 మందికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్‌ /కొత్తగూడెం కలెక్టరేట్‌, సెప్టెంబరు 17: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 20మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 5927 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 13, భద్రాద్రి జిల్లాలో 2,539మందికి పరీక్షలు నిర్వహిస్తే ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఇక 320 పడకలున్న ఖమ్మం ప్రధాన ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డులో శుక్రవారం ఆరుగురు చేరగా ఏడుగురు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మొత్తం 34మంది చికిత్స పొందుతుండగా 286 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.  

Updated Date - 2021-09-18T06:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising