ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములకలపల్లిలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-02-27T04:57:32+05:30

ములకలపల్లిలో కరోనా కలకలం

కరోనా బాధితుల ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకే కుటుంబంలో ఏడుగురికి నిర్ధారణ 

నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశం

ములకలపల్లి/కొత్తగూడెం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26: ఉమ్మడిజిల్లాలో కరోనా తగ్గు ముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో మరోసారి కలకలం రేగింది. మండలంలోని సుబ్బనపల్లి చెందిన ఓ కు టుంబంలో ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణైంది. దీంతో వారంతా హోం ఐసో లేషన్‌లో ఉన్నారు. దీంతో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక పారిశుధ్యచర్యలు చేపట్టారు. మూడు రోజుల క్రితం ములుగు జిల్లా రాజుపేటలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి క్రమంలోనే ఈ ఏడుగురికి కరోనా సోకినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే వారికి కరోనా సోకడంపై పూర్తి వివరాలు సేకరించి సమగ్ర నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌ను కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశించారు. వారితో ఎంతమంది సన్నిహితంగా మెలిగారు? ఎంతమందిని ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించి పరీక్షలు నిర్వహించారు లాంటి అంశాలపై సమగ్రంగా విచారించాలని సూచించారు. దీంతో డీఎం హెచ్‌వో సుబ్బనపల్లికి వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. పారిశుధ్య, వైద్య చర్య లపై ఆరా తీశారు. కరోనా బారిన పడిన వారు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏటూరునాగారంలోని బంధువులు ఇంట్లో శుభకార్యాలనికి వెళ్లడం వల్ల తనకు వైరస్‌ సంక్రమించిందని, తనద్వారా తమ కుటుంబంలోని వారికి వచ్చిందని కుటుంబంలోని వ్యక్తి చెప్పా రని డీఎంహెచ్‌వో తన నివేదికలో కలెక్టర్‌కు వివరించారు. బాధిత కుటుం బం ఉంటున్న ఇంటి పరిసరాలను కట్టడిప్రాంతంగా చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-02-27T04:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising