ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి జిల్లాలో వైరస్‌ విజృంభణ

ABN, First Publish Date - 2021-05-18T05:43:18+05:30

ఉమ్మడి జిల్లాలో వైరస్‌ విజృంభణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమవారం ఒక్కరోజే 1377మందికి పాజిటివ్‌, 15మంది కన్నుమూత

అధికారికంగా వెల్లడించని అధికారులు..

(ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం నెట్‌వర్క్‌)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ధాటికి రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండగా.. సోమవారం ఒక్క రోజే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1377మంది కొవిడ్‌బారిన పడినట్టుగా నిర్ధారణ వగా.. వేర్వేరుచోట్ల 15మంది మృత్యువాత పడినట్టు అనధికారిక సమా చారం. దీంతో ఉమ్మడిజిల్లా వాసులు భయంతో బిక్కుబిక్కుమం టున్నారు. ఉమ్మడిఖమ్మం జిల్లాలో సోమవారం 1377మంది కొవిడ్‌ బారినపడినట్టు నిర్ధారణైంది. ఖమ్మం జిల్లాలో 3,500మందికి పరీక్షలు నిర్వహించగా 935మంది కరోనా బారిన పడ్డారని అధకారిక సమా చారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 2,235 మందికి పరీక్షలు నిర్వహిస్తే 442 మందికి పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయితే కొవిడ్‌ లెక్కలకు సంబంధించి అధి కారులు ఎలాంటి బులిటెన్లు విడుదల చేయకపోతుంటం, అధికారులు వెల్లడించకపోవడంతో వాస్తవ లెక్కలపై స్పష్టత రావడం లేదు. ఇదిలా ఉంటే ఇద్దరిలో బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు కనిపించి నట్టువచ్చిన వార్తలు కలకలం రేపగా.. ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ మైనారిటీ నేత బుడాన్‌బేగ్‌ కొవిడ్‌, బ్లాక్‌ఫంగస్‌కు బెంగళూరులో చికిత్సపొందుతూ మృతిచెందగా.. కొత్తగూడేనికి చెందిన ఓ యువకుడు బ్లాక్‌ఫంగస్‌తో హైదరాబాద్‌లో కన్నుమూశాడు. 

టెస్టు కోసం నిల్చుని.. గుండెపోటుతో వ్యక్తి మృతి

కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఇల్లెందు మండలం కొమరారం ప్రాథమిక ఆసుపత్రికి వచ్చి క్యూలైన్లో నిలుచున్న మర్రిగూడెం పంచాయతీ ఎల్లాపురానికి చెందిన జోగ రాజు (60)అనే వ్యక్తి గుండె పోటుతో కుప్పకూలాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు కరోనా నిర్ధారణ కోసం సోమవారం కొమరారం ఆసుపత్రికి వెళ్లి.. లైన్‌లో నిల్చున్నాడు. ఈ క్రమంలో రాజు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. పీహెచ్‌సీ వైద్యులు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. 

Updated Date - 2021-05-18T05:43:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising