ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 687మందికి కరోనా

ABN, First Publish Date - 2021-05-17T05:14:47+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 687మందికి కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుగురు మృత్యువాత

కొత్తగూడెం కలెక్టరేట్‌ / ఖమ్మం సంక్షేమవిభాగం, మే 16: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివరం 687మందికి కొవిడ్‌ నిర్ధారణవగా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆదివారం మొత్తం 1,220 మందికి పరీక్షలు నిర్వహిస్తే 372 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 850మందికి పరీక్షలు చేయగా 315మంది కరోనా బారిన పడినట్టు నిర్ధారణైంది. ఇక భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం డబ్లుఎల్‌రేగుబల్లికి చెందిన వ్యక్తి(39) భద్రాచలం పేపర్‌ బోర్డ్‌లో క్యాజువల్‌ లేబర్‌గా పనిచేస్తున్నాడు.ఆయన కరోనా బారిన పడి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అశ్వారావుపేట పట్టణానికి చెందిన వ్యాపారి సమయమంతుల ప్రతాప్‌(38) కొవిడ్‌తో గుంటూరు ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా.. దహనసంస్కారాలను పవన్‌కళ్యాణ్‌ సేవా సమితి వారు నిర్వహించారు. ఇల్లెందుకు చెందిన వృద్ధురాలు (85) ఐదురోజులుగా కరోనాతో ఐసోలేషన్‌కేంద్రంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. చర్ల మండలం రాళ్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి రెండు రోజుల క్రితం కరోనా బారిన పడగా కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. 

Updated Date - 2021-05-17T05:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising