ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 435 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-04-11T05:59:53+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 435 మందికి కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమవిభాగం, ఏప్రిల్‌ 10: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోకుంటే ఆ రాకాసి విలయతాండవం చేసే అవకాశముంది. శుక్ర, శనివారాల్లో నమోదైన పాజిటివ్‌ కేసులే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం 435మంది కొవిడ్‌బారిన పడినట్టు నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4066 మందికి పరీక్షలు నిర్వహించగా.. 135మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఖమ్మం జిల్లాలో రెండు వేల మందికి పరీక్షలు నిర్వహించగా 300 మందికి పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

భద్రాద్రి జిల్లాలో 60శాతం వ్యాక్సినేషన్‌ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం 3,865మందికి కరోనా వ్యాక్సినేషన్‌ ఇవ్వడం జరి గింది. మొత్తం టార్గెట్‌ 6,475 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వ లక్ష్యం నిర్దారిస్తే కేవలం 3,865మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకొని వ్యాక్సిన్‌ తీసుకొన్నారు. దీంతో 60శాతం మంది మాత్రమే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకొన్నారు. 

Updated Date - 2021-04-11T05:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising