ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల ఆకాంక్షలపై.. అహంకారం తగదు

ABN, First Publish Date - 2021-02-28T04:57:44+05:30

పాత బస్టాండ్‌ను సిటీ బస్టాండ్‌గా కొనసాగించాలనేది ప్రజల అకాంక్షని, దానిపై అధికార అహంకారం తగదని విపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మాట్లాడుతున్న విపక్ష నాయకులు, ఆందోళనకారులను తీసుకెళుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పాతబస్టాండ్‌ను లోకల్‌ బస్టాండ్‌గా కొనసాగించాలి

ఉద్యమాన్ని ఉధృతం చేయలని విపక్షాల నిర్ణయం

ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు

ఖమ్మంమయూరిసెంటర్‌, ఫిబ్రవరి27: పాత బస్టాండ్‌ను సిటీ బస్టాండ్‌గా కొనసాగించాలనేది ప్రజల అకాంక్షని, దానిపై  అధికార అహంకారం తగదని  విపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం పాతబస్టాండ్‌ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.    పోలీసులు ఆ నాయకుల అరెస్టుకు యత్నించారు. దీంతో నాయకులు పోలీసులకు తీవ్రతోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలువురు నేతలపై స్థానిక ఎస్‌ఐ అమానుషంగా ప్రవర్తించడంతో విపక్ష నాయకులు తీవ్ర అందోళన వ్యక్తం చేశారు. దీంతో త్రీటౌన్‌ సీఐ కలుగ చేసుకోని ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా పలువురు విపక్ష నాయకులు పోట్ల నాగేశ్వరరావు, అప్రోజ్‌ సమీనా, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఆవుల అశోక్‌ మాట్లాడారు. కొంతకాలంగా బస్టాండ్‌ తరలింపుపై ఆందోళన జరుగుతున్న స్థానిక మంత్రి పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోని మంత్రి తమకు అవసరం లేదంటూ నినాదాలు చేశారు. ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా ప్రైవేట్‌ వ్యక్తులకు ప్రభుత్వ భూములను అప్పగించేందుకు సన్నద్దం చేస్తున్నారని ఆరోపించారు. కనీసం బస్టాండ్‌పై ప్రభుత్వానికి విన్నవించే ధైర్యం మంత్రికి లేదన్నారు. బస్టాండ్‌ తరలింపును అడ్డుకోక పోతే జిల్లా కేంద్రం నుంచి మండల స్థాయి వరకు అందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దీపక్‌ చౌదరి, అప్రోజ్‌ సమీనా, శ్రీకాంత్‌, వై విక్రమ్‌, లింగయ్య, మనోహర్‌, ఖయ్యుం, నవీన్‌రెడ్డి, సత్యనారాయణ, అజిత, బేగం, శ్రీను, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-02-28T04:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising