ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంతెన.. అంతేనా?

ABN, First Publish Date - 2021-06-21T04:34:37+05:30

అసలే మారుమూల గ్రామాలు. వర్షాకాలం వస్తే అంతే సంగతులు. ముఖ్యంగా పెద్దవాగు పొంగితే బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆ వాగుపై ఏళ్లక్రితం ఒక వంతెన నిర్మించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినా, వాగులు ఉప్పొంగినా వంతెన రాకపోకలకు ఇబ్బంది ఉండేది కాదు. దాని మీద ఒత్తిడి పెరగడం, గతేడాది భారీవర్షాలు కురిసి వాగులు ఉప్పొం గడంతో వంతెన కుంగింది. ఒకానొక దశలో పెద్దవాగు ప్రవాహ ధాటికి కొట్టుకుపోతుందని భావించారంతా.. కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు.

కుంగిన బర్లగూడెం వంతెన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతేడాది వరదలకు కుంగిన బర్లగూడెం పెద్దవాగు బ్రిడ్జి

ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసినా మొదలవ్వని పనులు

నరకం చూస్తున్న ఏజెన్సీ ప్రజలు.. వాగు ఉప్పొంగితే అంతే సంగతులు

కరకగూడెం, జూన్‌ 20: అసలే మారుమూల గ్రామాలు. వర్షాకాలం వస్తే అంతే సంగతులు. ముఖ్యంగా పెద్దవాగు పొంగితే బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆ వాగుపై ఏళ్లక్రితం ఒక వంతెన నిర్మించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినా, వాగులు ఉప్పొంగినా వంతెన రాకపోకలకు ఇబ్బంది ఉండేది కాదు. దాని మీద ఒత్తిడి పెరగడం, గతేడాది భారీవర్షాలు కురిసి వాగులు ఉప్పొం గడంతో వంతెన కుంగింది. ఒకానొక దశలో పెద్దవాగు ప్రవాహ ధాటికి కొట్టుకుపోతుందని భావించారంతా.. కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు..

 గత సంవత్సరం మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు ఉధృతంగా ప్రవహించింది. దాంతో మండలంలోని మొతె వద్ద బర్లగూడెం, రఘునాఽథపాలెం, వెంకట్రాపురం, నర్సంపేట కాలనీకి వెళ్లేందుకు ఉపయుక్తంగా ఉండే వంతెన పూర్తిగా కుంగి పోయింది. దీంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలం అనంతరం అధికారులు కుంగిన వంతెనపై మొరం పోసి తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తే కుంగిన వంతెనపై పోసిన మట్టి కొట్టుక పోయి రాక పోకలకు ఇబ్బందులుపడక తప్పదని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసినా..

మండలంలోని బర్లగూడెం వంతెన గత సంవత్సరం పెద్దవాగు ఉధృతికి పూర్తిగా కుంగిపోయింది. అప్పట్లో వంతెనను ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. అనంతరం పెద్దవాగుపై నూతన వంతెన నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించడంతో.. ప్రభుత్వం రూ.1.20 కోట్లు మంజూరు చేసింది. వాటితో వంతెన నిర్మాణం కాదని ప్రభుత్వానికి రేగా ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం రూ. 4.50 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు ఏప్రిల్‌ నెలలో రేగా ప్రకటించారు. నిధులు మంజూరయినా నేటికి సంబంధిత అధికారులు పెద్దవాగుపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపఽథ్యంలో పెద్దవాగు ప్రవాహం పెరిగితే రాకపోకలకు ఇబ్బందులు తప్పవని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రేగా కాంతారావు చొరవ తీసుకుని వంతెన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2021-06-21T04:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising