ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవాహ్నికోత్సవాలకు రేపు శ్రీకారం

ABN, First Publish Date - 2021-04-16T06:14:47+05:30

నవాహ్నికోత్సవాలకు రేపు శ్రీకారం

భద్రాద్రి రామయ్య కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20న ఎదుర్కోలుతో రామయ్య కల్యాణ క్రతువు ప్రారంభం

కొవిడ్‌ నేపథ్యంలో నవమి, పట్టాభిషేకానికి భక్తులకు లేని దర్శన భాగ్యం

టీవీల్లో ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారం 

భద్రాచలం, ఏప్రిల్‌ 15: తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నవాహ్నిక వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. తొలి రోజున గోదావరి నుంచి తీర్ధబిందె ను తీసుకొచ్చి అంకురారోపణం చేస్తారు. 18న ధ్వజపట మండల లేఖనం, 19న ధ్వజారోహణం, 20న ఎదుర్కోలు, 21న శ్రీసీతారామచంద్రస్వామి కల్యా ణాన్ని నిత్యకల్యాణ మండప వేదిక వద్ద నిర్వహిస్తారు. కరోనా వ్యాప్తి నేప థ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరాడంబరంగా ఈ ఉత్సవా లను నిర్వహించనున్నారు. 22న మహా పట్టాభిషేకాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.

ఆ రెండు రోజులు భక్తుల ప్రవేశం నిషేధం

భద్రాచలంలో 21, 22తేదీల్లో నిర్వహించే సీతారామచంద్రస్వామి కల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేక ఉత్సవాలకు భక్తులకు ప్రవేశం నిషేధించామని దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియాకు వివరాలను అందించారు. కరోనా వైరస్‌ రెండో విడత ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 20న ఎదుర్కోలు ఉత్సవం, 21న స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం, 22న మహాపట్టాభిషేకం కార్యక్రమాలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది సిబ్బంది సమక్షంలో మాత్రమే నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రధాన ఉత్సవాలు జరిగే రెండు రోజులు ఆలయంలో అన్ని రకాల దర్శనాలను రద్దు చేశామని వెల్లడించారు. దీనికి భక్తులు సహకరిం చాలని కోరారు. స్వామివారి కల్యాణం, మహాపట్టాభిషేకాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని సూచించారు. 

Updated Date - 2021-04-16T06:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising