ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన వైద్యం అందించండి{ జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజు

ABN, First Publish Date - 2021-03-25T04:54:28+05:30

అస్వస్థతకు గురైన బాధితులందరికి మెరుగైన వైద్యం అందించాలని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు కోరారు.

పరామర్శిస్తున్న జడ్పీ చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బాధితులను ఫోన్‌లో పరామర్శించిన సీఎల్పీ నేత భట్టి

చింతకాని మార్చి24: అస్వస్థతకు గురైన బాధితులందరికి మెరుగైన వైద్యం అందించాలని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు కోరారు. మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో మంగళవారం కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మండల ప్రాఽథమికి ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఆయన పరామర్శించి బాఽధితులతో మాట్లాడారు.  వారి ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యాధికారి డాక్టర్‌ అల్లాడి నాగేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతితో ఫోన్‌లో మాట్లాడుతూ అవసరమైన సిబ్బంది మందులు చింతకాని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలని కోరారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. పరిస్థితి ఇబ్బందిగా ఉంటే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు.  108 వాహనాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. మండల అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని కిషోర్‌, వైప్‌ ఎంపీపీ గురజాల హనుమంతరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య,తహసీల్దార్‌ తిరుమలాచారి,ఎంపీడీఓ దావులూరి లలితకుమారి, ఎంపీఓ మల్లెల రవీంద్రప్రసాద్‌, వైద్యాధికారులు తదితరలు పాల్గొన్నారు.

 ఫోన్‌లో భట్టి పరామర్శ: అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితుల గురించి సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఫోన్‌ ద్వారా మండల వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. బాధితులతో ఫోన్‌లో మాట్లాడి అండగా ఉంటానని హమీ ఇచ్చారు.


 అధికారులు,ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ


అస్వస్థతకు గురైన వారంతా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య స్వగ్రామం కావడంతో వారందరిని మంగళవారం రాత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలు, కార్ల ద్వారా తరలించి అందరికి వైద్యం అందించే వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. సమాచారం తెలుసుకున్న జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిషోర్‌, ఎ్‌సఐ రెడ్డబోయిన ఉమ, ఎంపీఓ మల్లెల రవీంద్రప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి షేక్‌ సైదులు ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. 

 కాగా మెరుగైన వైద్యం కోసం 21మంది బాధితులను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి బుధవారం రాత్రి తరలించినట్టు వైద్యులు తెలిపారు.


Updated Date - 2021-03-25T04:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising