ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెస్ట్‌ అవైలబుల్‌కు నోటిఫికేషన్‌ విడుదల

ABN, First Publish Date - 2021-06-21T04:19:30+05:30

షెడ్యూల్‌ కులముల అభివృద్ధిశాఖ అధ్వర్యంలో ప్రాథమిక విద్యను కార్పొరేట్‌ స్థాయిలో అందించేందుకు ఏర్పాటు చేసిన బెస్ట్‌ అవైలబుల్‌ విద్యా నోటిపికేషన్‌ను ఆదివారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 5వ తరగతి వసతిగృహంలో 49 సీట్లు

  1వ తరగతి నాన్‌రెసిడెన్సియల్‌లో 50సీట్లు

ఖమ్మంసంక్షేమవిభాగం, జూన్‌ 20: షెడ్యూల్‌ కులముల అభివృద్ధిశాఖ అధ్వర్యంలో ప్రాథమిక విద్యను కార్పొరేట్‌ స్థాయిలో అందించేందుకు ఏర్పాటు చేసిన బెస్ట్‌ అవైలబుల్‌ విద్యా నోటిపికేషన్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా సాంఘీక సంక్షేమశాఖ డీడీ కస్తాల సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. రెసిడేన్సియల్‌ విధానంలో బెస్ట్‌ అవైలబుల్‌ పథకం ద్వారా 5వ తరగతిలో 49సీట్లు కేటాయించామన్నారు. నాన్‌ రెసిడెన్సియల్‌ విధానంలో 1వ తరగతిలో 50 సీట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆ ప్రకటనలో చెప్పారు. సీట్లు కేటాయింపు జిల్లాస్థాయిలో సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో డ్రా విధానంలో నిర్వహిస్తామన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక్క విద్యార్ధి మాత్రమే దరఖాస్తులకు అర్హత ఉంటుందన్నారు. కేవలం ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థులు మాత్రమే ధరఖాస్తులు చేయాలని సూచించారు. 5వ తరగతిలో చేరే వారు ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలలో 4వ తరగతి విద్యార్హత ఉండాలని సూచించారు. కేవలం ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఈనెల 22 నుంచి వచ్చేనెల 8 వరకు దరఖాస్తు చేయాలన్నారు. పూర్తి వివరాలకు డీఆర్‌డీఏ కార్యాలయంలోని షెడ్యూల్‌ కులముల అభివృద్దిశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు చేసిన విద్యార్థులకు 14న ఖమ్మంలోని అంబేద్కర్‌ భవనంలో లాటరీ పద్దతిలో ఎంపిక చేస్తామని వివరించారు.c

Updated Date - 2021-06-21T04:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising