ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలరామ్‌ నాయక్‌ తీరు హాస్యాస్పదం

ABN, First Publish Date - 2021-01-17T05:19:38+05:30

డీసీసీ అధ్యక్షుడు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై మాజీ ఎంపీ బలరాంనాయక్‌ పత్రికా ముఖంగా చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చందాలింగయ్య దొర అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న చందా లింగయ్య, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చందా లింగయ్య దొర

మణుగూరు, జవనరి 16: డీసీసీ అధ్యక్షుడు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై మాజీ ఎంపీ బలరాంనాయక్‌ పత్రికా ముఖంగా చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చందాలింగయ్య దొర అన్నారు. శనివారం మణుగూరలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మండల పార్టీ అధ్యక్షుడు గురజాల గోపి, నవీన్‌ ఐఎ్‌సరావుతో కలిసి మాట్లాడారు. డీసీసీ అఽధ్యక్షుడికి పార్టీలో ఎవరైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిని సస్పెండ్‌ చేసే అఽధికారం లేదనడం శోచనీయమన్నారు. మాజీ స్థాయి వ్యక్తికి నేటికీ పార్టీ విధివిధానాలు తెలియకుండా మాట్లాడటం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేతో ఆ పార్టీ కండువాలు కప్పుకుని కాంగ్రె్‌స పార్టీకి మోసం చేసిన అక్కిరెడ్డి సంజీవరెడిని సస్పెండ్‌ చేయడం సరైంది ఎందుకు కాదని ప్రశ్నించారు. బలరాం నాయక్‌ టీఆర్‌ఎస్‌  కోవర్టుల ఉచ్చులో పడకూడదని హితవు పలికారు. మహబూబాబాద్‌ నియోజకవర్గంలో ఇలానే పార్టీకి వ్యతిరేక విధానాలకు పాల్పడిన నాయకులను అక్కడి పార్టీ జిల్లా అధ్యక్షులు సస్పెండ్‌ చేయలేదా? ఈ విషయం బలరాంనాయక్‌కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో కరకగూడెం మండల అధ్యక్షులు హుస్సేన్‌, పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising