ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో డ్రైవర్‌ నిజాయితీ

ABN, First Publish Date - 2021-03-09T05:14:57+05:30

ఓ మహిళ ఆటోలో బ్యాగును మరిచి దిగిపోగా అది చూసిన ఆటోడ్రైవర్‌ డేరంగుల రవీందర్‌బాబు ఆమె ఎవరో తెలియక బ్యాగును పొలీ్‌సస్టేషన్‌కు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు.

పొలీ్‌సస్టేషన్‌కు తెచ్చి ఇచ్చిన బ్యాగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మరిచిపోయిన బ్యాగు పొలీ్‌సస్టేషన్‌లో అప్పగింత

కొణిజర్ల, మార్చి 8: ఓ మహిళ ఆటోలో బ్యాగును మరిచి దిగిపోగా  అది చూసిన ఆటోడ్రైవర్‌ డేరంగుల రవీందర్‌బాబు ఆమె ఎవరో తెలియక బ్యాగును పొలీ్‌సస్టేషన్‌కు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు.ఈ సంఘటన సోమవారం జరిగింది. ఎస్‌ఐ మొగిలి తెలిపిన వివరాలు ప్రకారం శైలజ అనే మహిళ ఖమ్మం నుంచి తన  తల్లిగారి ఊరు కొణిజర్ల మండలం అమ్మపాలెం వచ్చేందుకు తనికెళ్ల గ్రామానికి చెందిన ఆటో ఎక్కింది. తనికెళ్ల నుంచి ఆ గ్రామానికి వెళ్లవలసి ఉండగా తనికెళ్ల వచ్చాక అక్కడ దిగి తనవెంట తెచ్చుకున్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయింది. తర్వాత బ్యాగు గుర్తుకు వచ్చి ఆటోకోసం ప్రయత్నించగా ఆమెకు కనిపించలేదు. బాదితురాలు కొణిజర్ల పొలీ్‌సస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు రాగా అంతలోనే ఆటోడ్రైవర్‌ రవీందర్‌బాబు పొలీ్‌సస్టేషన్‌కు వచ్చి ఆటోలో బ్యాగును మరిచిపోయారని ఎస్‌ఐకు అప్పగించాడు. అది చూసిన బాధితురాలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. బ్యాగులో రెండు తులాల బంగారు చైన్‌, పూసలతాడు, చెవి దిద్దులు, బంగారపు ఉంగరం, కొంతనగదు ఉన్నాయి. బాధితురాలు కూడ అన్ని సక్రమంగానే ఉన్నాయని గుర్తించింది. ఆటోడ్రైవర్‌ నిజాయితీ చూసి ఎస్‌ఐ అతడిని అభినందించాడు. బ్యాగును బాదితురాలికి అప్పగించారు. 


Updated Date - 2021-03-09T05:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising