ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలసాని కుమారుడిపై అట్రాసిటీ కేసు

ABN, First Publish Date - 2021-02-25T05:05:07+05:30

ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ కుమారుడు విజయ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూసుమంచి, ఫిబ్రవరి 24: ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ కుమారుడు విజయ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కూసుమంచి ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి కధనం ప్రకారం.. కోక్యాతండ నుంచి లింగారంతండ వరకు కాంట్రాక్టర్‌ విజయ్‌ రహదారి నిర్మాణం చేపట్టారు. మంగళవారం సాయంత్రం కోక్యాతండకు చెందిన హాళావత్‌ బికనా వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. బీటీరహదారి నిర్మాణం కారణంగా వ్యవసాయ చేనుకు వెళ్లేందుకు మట్టికుప్పలు అడ్డువస్తున్నాయని, వాటిని చదును చేయించాలని విన్నవిం చాడు. ఈక్రమంలో ఇరువురి మధ్య మాటామట పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విజయ్‌తో పాటు అతని బంధువు నవీన్‌ కలిసి బికనాపై అడ్డువచ్చిన పుల్లయ్యపై దాడి చేశారు. తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుని ఖమ్మం తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పొలాలకు వెళ్లే రహదారిని చదును చేయమని అడిగినందుకు తన భర్తను కులంపేరుతో దూశించి కొట్టారని బికనా భార్య కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.  బుధవారం రాత్రి విజయ్‌ అతని బంధువు నవీన్‌పై అట్రాసిటి, దాడి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ  తెలిపారు.

ఫిర్యాదు చేసినా విజయ్‌పై అతని బంధువు నవీన్‌ను ఇంకా అరెస్ట్‌ చేయలేదని సీపీఎం మండలకార్యదర్శి బారి మల్సూర్‌ ఆధ్వర్యంలో బికనా కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళన వ్యక్తం చేశారు.  దీంతో కూసుమంచి సీఐ సతీష్‌, ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి వచ్చి ఆందోళన కారులతో చర్చించారు. నిందితులపై కేసునమోదు చేయడం జరిగిందని ఎటువంటి అన్యాయం జరగదని హామీఇచ్చారు.


Updated Date - 2021-02-25T05:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising