ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందితులను పట్టించిన నిఘా కెమెరాలు

ABN, First Publish Date - 2021-12-16T04:35:22+05:30

మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎంను పగలకొట్టి డబ్బులు తస్కరించేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు ఖమ్మం రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

కారేపల్లి డిసెంబరు15: మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎంను పగలకొట్టి డబ్బులు తస్కరించేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు ఖమ్మం రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు. మండల పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో విషయాలను వెల్లడించారు. గేటుకారేపల్లి కు చెందిన నిమ్మల సందీప్‌, కందుల రాజు, మరో మైనర్‌ కలిసి మంగళవారం రాత్రి మోటర్‌సైకిల్‌పై వచ్చి మండల కేంద్రంలోని ఏటీఎంను పరిశీలించి వెళ్లారు. అదేరాత్రి మేకలతండాకు చెందిన రవీందర్‌ అనే వ్యక్తికి చెందిన  బొలెరో వాహనాన్ని తీసుకుని అర్ధారాత్రి 12గంటల నుంచి ఏటీఎం కంటేనర్‌ (మనీబాక్స్‌)ను తెరించేందకు ప్రయత్నించారు. అయితే అది ఎంతకూ తెరుచుకోకపోవడంతో తాళ్లతో బొలెరోకు కట్టి బయటకు తీసుకువచ్చారు. కంట్తెనర్‌ మూడు టన్నుల బరువు ఉండటంతో ఎత్తి బొలెరోలో తీసుకెళ్లేందుకు సాధ్యపడలేదు. అప్పటికే తెల్లవారు జూమున 3గంటలు అవుతుండటంతో కంటేనైర్‌ను అక్కడే వదిలివెళ్లారు, అయితే కంటైనర్‌లో రూ.4.4 లక్షల నగదు ఉంది. విషయం తెలసుకున్న కారేపల్లి రూరల్‌ సీఐ ఆరీఫ్‌ ఆలీఖాన్‌ ఆధ్వర్యంలో సీసీ కెమోరాల ఆధారాలతోపాటు, క్లూస్‌టీం, సిబ్బంది సహాయంతో బుధవారం నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులను కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. 12గంటల వ్యవధిలో నిందుతులను పట్టుకున్న సీఐ ఆరీఫ్‌ఆలీఖాన్‌, ఎస్‌ఐ కుష్‌కుమార్‌ను సీపీ అభినందించారు. త్వరలోనే రివార్డు కూడా అందజేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-12-16T04:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising