ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మ నిమజ్జనంలో అపశ్రుతి

ABN, First Publish Date - 2021-10-18T05:20:55+05:30

బతుకమ్మ నిమజ్జనంలో అపశ్రుతి

మధులత మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్‌కాలువలో పడి ఇద్దరి మృతి

కల్లూరు మండలం రఘునాథగూడెంలో ఘటన

కల్లూరు, అక్టోబరు 17: ఓ వైపు దేవీ శరన్నవ రాత్రులు.. మరో వైపు బతు కమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఆ గ్రామంలో నిమజ్జనం రోజున తీవ్ర విషాదం అలముకుంది. బతుకమ్మ నిమజ్జన సమ యంలో ఓ వివాహిత, మరో యువకుడు కాలువలో గల్లంతై మృతిచెందారు. ఈ సంఘటన ఖమ్మంజిల్లా కల్లూరు మండలం రఘునాథగూడెం గ్రామం లో శనివారం రాత్రి జరిగింది. శని వారం రాత్రి దుర్గాదేవి అమ్మవారు, బతుకమ్మలను ఘనంగా వీడ్కోలు పలికేందుకు గ్రామంలో శోభయాత్రను అట్టహాసంగా నిర్వహించారు. చివరకు శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గ్రామ సమీపంలోని సాగర్‌ ఎడమకాలు వద్దకు చేరుకున్న మమిళలు బతుకమ్మలను నిమజ్జనం చేస్తుండగా కంభంపాటి మధు లత(23) అనే వివాహిత ప్రమాదవశాత్తు కాలువలో జారిపడింది. దానిని గమనించిన అదే గ్రామానికి చెందిన యువకుడు పసుపులేటి శివ(23) మధులతను రక్షించేం దుకు ప్రయత్నించి.. ప్రమాదవశాత్తూ నీటమునిగి గల్లంతయ్యాడు. తొలుత ఆ గ్రామానికి చెందిన భక్తుల్లోని కొందరు ఈతగాళ్లు కాలువలోకి దిగి మధులతను రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందగా.. బాగా చీకటిగా ఉండటంతో శివ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం గ్రామస్థులు మళ్లీ గాలించగా శివ మృతదేహం కనిపించింది. నవరాత్రుల చివరిరోజున ఈ సంఘటన జరగటంతో గ్రామంలో విషాదచాయలు అలు ముకున్నాయి. ఎంఎస్సీ చదివిన మధులత.. దసరా పండుగ జరుపుకొనేం దుకు గాను భర్త రామకృష్ణ, రెండేళ్ల కుమారుడితో కలిసి రఘునాథ గూడెంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. తమతో పండుగ చేసుకునేందుకు వచ్చిన తమ కూతురు ఇలా తనువుచాలించడంతో మధులత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అలాగే రైతు కుటుంబానికి శివ కూడా హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో చిరుద్యోగం చేస్తున్నాడు. దసరా పండుగ కోసమని స్వగ్రామానికి వచ్చాడు. చేతికొచ్చిన తమకు ఏకైక కుమా రుడికి ఈ ఏడాది వివాహం చేద్దామని చేద్ధామని నిర్ణయించుకున్నామని, కానీ ఇలా తమకు కడుపుకోత మిగిల్చి వెళ్లిపోయాడని శివ తల్లిదండ్రులు రామయ్య, ధనమ్మ గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కంటతడిపెట్టించింది. సాగర్‌కాలువలో పడి యువతి, యువకుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌, సీఐ తాటిపాముల కరుణాకర్‌, ఎస్‌ఐ రఫి సంఘటనాస్థలాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేశారు. 

ఎమ్మెల్యేతో పాటు పలువురి సంతాపం

రఘునాథగూడెం గ్రామంలో నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మృతిచెందిన మధులత, శివ కుటుంబాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫోన్లో పరామర్శించి.. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఎంపీపీ బీరవల్లి రఘు, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు పెడకంటి రామకృష్ణ మృతదేహాలకు పోస్టుమార్టం అయ్యేందుకుగానూ సహాయ సహకారాలు అందించారు. కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి, సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్‌, రైతుబంధు ప్రతినిధులు పసుమర్తి చంద్రరావు, డాక్టర్‌ లక్కినేని రఘు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాలెపు రామారావు, కొరకొప్పు ప్రసాద్‌, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ కుక్కా అంజన్‌రావు, చల్లగుండ్ల వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. 



Updated Date - 2021-10-18T05:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising