ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎన్జీవో జిల్లా కన్వీనర్‌గా అఫ్జల్‌ హాసన్‌

ABN, First Publish Date - 2021-10-30T04:29:51+05:30

తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ జిల్లా అడ్హక్‌ కన్వీనర్‌గా షేక్‌ అఫ్జల్‌ హాసన్‌ను నియమితు లయ్యారు.

నియామకపు పత్రాన్ని అందిస్తున్న కేంద్రకమిటీ అధ్యక్షుడు నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మంకలెక్టరేట్‌, అక్టోబరు29: తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ జిల్లా అడ్హక్‌ కన్వీనర్‌గా షేక్‌ అఫ్జల్‌ హాసన్‌ను నియమితు లయ్యారు. ఈమేరకు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ నియామకపు ఉత్తర్వులను అంద చేశారు. జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన పొట్ట పింజర రామయ్య ఇతర జిల్లాకు బదిలీ కావడంతో, నాలు గు నెలలకు పైగా  ఆ స్థానం ఖాళీగా ఉంది. కొత్త కమిటీ కోసం సెంట్రల్‌ కమిటీ కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో అడహక్‌ కమిటీని నియమించారు. హైద రాబాద్‌లో నియామకపు పత్రాన్ని అందించి అభినందించారు. 

 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: అఫ్జల్‌ హాసన్‌

 అఫ్జల్‌హాసన్‌ ప్రస్తుతం సెంట్రల్‌కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. టీఎన్జీవో కమిటీపై, హౌజింగ్‌ సొసైటీపై పలు ఆరోపణల నేపథ్యంలో స్థబ్దుగా ఉంది. ఈ తరుణంలో అఫ్జల్‌ హాసన్‌ను జిల్లా కన్వీనర్‌గా నియమించడంతో  ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.  నిత్యం అందుబాటులో ఉండి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అఫ్జల్‌హాసన్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు.  కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఆర్వీఎస్‌ సాగర్‌, నందగిరి శ్రీను,మజీద్‌, సునిల్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ సంఘం ఉద్యోగుల సంఘం నాయకులు రాజేష్‌, కంచిశ్రీను, శ్రీనివాసరెడ్డి, కిరణ్‌, కూరపాటి శ్రీను, లోకేష్‌, జిల్లా ఆస్పత్రి టీఎన్జీవో నాయకులు జ్యోతి, ఎల్‌ లక్ష్మీ సత్యనారాయణ అభినందించారు. అనంతరం హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

Updated Date - 2021-10-30T04:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising