ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి జిల్లాలో తొలిరోజు 3,420 కొత్త కార్డుల పంపిణీ

ABN, First Publish Date - 2021-07-27T04:37:35+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడేళ్లుగా రేషనకార్డు కోసం ఎదురు చూసిన లబ్ధిదారుల నిరీక్షణ ఫలించింది. ప్రభుత్వం జిల్లాకు 12,574 కొత్త రేషనకార్డులు మంజూరు

కొత్తగూడెంలో ఆహార బద్రతాకార్డులను పంపిణీ చేస్తున్న ఎమ్మేల్యే వనమా వెంకటేశ్వరరావు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొత్తం 12,574 ఆహారభద్రతా కార్డుల మంజూరు 

 కొత్తగూడెం కలెక్టరేట్‌ జులై 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడేళ్లుగా రేషనకార్డు కోసం ఎదురు చూసిన లబ్ధిదారుల నిరీక్షణ ఫలించింది. ప్రభుత్వం జిల్లాకు 12,574 కొత్త రేషనకార్డులు మంజూరు చేయగా సోమవారం పంపిణీ ప్రారంభించారు. తొలిరోజు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 3,420రేషన కార్డులను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. కొత్తగూడెంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్‌ అనుదీప్‌ కార్డులను పంపిణీ చేశారు.   అశ్వాపురంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ, అదనపు కలెక్టర్‌ కె. వెంకటేశ్వర్లు కొత్తకార్డులను పంపిణీ చేశారు. వైరా నియోజకవర్గంలోని జూలూరుపావు మండంలో మొత్తం 419 రేషనకార్డులు మంజూరు కాగా 385రేషన కార్డులను పంపిణీ చేశారు. 

Updated Date - 2021-07-27T04:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising