ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS: మద్యం మత్తులో పోలీసులపై దాడి

ABN, First Publish Date - 2021-11-22T12:54:48+05:30

మద్యం మత్తులో కొందరు పోలీసులపైనే దాడిచేశారు. ఈ సంఘటన మండలంలోని వీవీ పాలెం పరిధిలో ఓ దాబాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఆనంద్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

9మందిపై కేసు నమోదు

నిందితుల్లో ఒక ఎంపీటీసి, ఒక సర్పంచ్‌

ఖమ్మం/రఘునాథపాలెం: మద్యం  మత్తులో కొందరు పోలీసులపైనే దాడిచేశారు. ఈ సంఘటన మండలంలోని వీవీ పాలెం పరిధిలో ఓ దాబాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఆనంద్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘునాథపాలెం ఎస్‌ఐ మాచినేని రవి కేసు నమోదు చేశారు. మద్యం డ్రా ముగిసిన తరువాత కొణిజర్ల మండలం, ఖమ్మం నగరానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు దావత్‌ చేసుకు నేందుకు దాబాకు వెళ్లారు. అక్కడ మద్యం తాగుతున్నారు. అదేసమయంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాబాకు వచ్చారు. అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తనిఖీ కోసం వెళ్లారు. మద్యం తాగుతున్న వారిని వారిస్తుండగా మద్యం మత్తులో ఉన్న వారు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.  దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ వారిలో తనికెళ్ల ఎంపీటీసి గుండ్ల కోటేశ్వరరావు, రాజ్యాతండ సర్పంచ్‌ మూడు సురేష్‌, కొణిజర్ల మండల టీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ  అధ్యక్షుడు కోసూరి శ్రీనివాసరావు, వైరా మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రాయల పుల్లయ్య, గుర్రం రాజేష్‌, జమ్ముల ప్రవీణ్‌రెడ్డి, తుల్లూరి రమేష్‌, అనంతుల సత్యనారాయణ,  రెస్టారెంట్‌ నిర్వాహకుడు పుల్లయ్య (తంబీ)లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-22T12:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising