ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసముద్రం మార్కెట్‌ ఆదాయం రూ.2.29కోట్లు

ABN, First Publish Date - 2021-04-02T05:20:24+05:30

కేసముద్రం మార్కెట్‌ ఆదాయం రూ.2.29కోట్లు

కేసముద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌తో తగ్గిన మార్కెట్‌ ఫీజు 

పెరిగిన ప్రభుత్వ సంస్థల చెల్లింపులు 


కేసముద్రం, ఏప్రిల్‌ 1 : కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 2020-21 ఆర్థి క సంవత్సరం ఆదాయం రూ.2.29 కోట్లు వచ్చింది. మార్కెట్‌ యార్డులో వ్యాపారులు ఖరీదు చేసే సరుకు విలువపై 1 శాతం మార్కెట్‌ ఫీజు వసూ లు చేస్తారు. మార్కెట్‌ పరిధిలో యా ర్డు వెలుపల చేసే సరుకు కొనుగోళ్లపై 1 శాతం రాస్తామాల్‌, చెక్‌పోస్టులు, గోదాముల అద్దె తదితర మార్గాల ద్వా రా ఆదాయం వస్తుంది. ఈఏడాది రూ. 3.22కోట్ల ఆదాయ లక్ష్యాన్ని మార్కెటిం గ్‌ శాఖ నిర్ణయించగా రూ.2,29,03,408 వచ్చింది. ఇందులో మార్కెట్‌ ఫీజు రూ.71,72,170, మరిపెడచెక్‌పోస్టు ద్వా రా రూ.3,94,166, ఇనుగుర్తి చెక్‌పోస్టు ద్వారా రూ.68,569 వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.1,52,68,503 రాగా ఇందులో సివిల్‌ సప్లై నుంచి రూ.1.14కోట్లు, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.38లక్షలు వచ్చా యి. మార్కెట్‌ ఫీజులో వ్యాపారులు ఇచ్చిన రూ.15లక్షల చెక్కులు ఇంకా మార్కెట్‌ ఖాతాలో జమ కావాల్సిఉంది. గత ఏడాది మార్కెట్‌ ఆదాయం రూ. 2.81కోట్లు వచ్చింది. ఇందులో మార్కె ట్‌ ఫీజు రూ.1.88కోట్లు, చెక్‌పోస్టులు రూ.10.03లక్షలు, ప్రభుత్వ కొనుగోలు సంస్థల నుంచి రూ.80.83లక్షలు వచ్చా యి. లాక్‌డౌన్‌తో మూడు నెలల పాటు మార్కెట్‌ పూర్తిగా బంద్‌ ఉండడంతో మార్కెట్‌ ఫీజు భారీగా తగ్గినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలైన సివిల్‌ సప్లై ద్వారా వరి, సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ళతో గత ఏడాది రూ.80.83లక్షలు రాగా ఈసారి రూ.1.52కోట్లు వచ్చాయి. మార్కెట్‌ ఫీజు లోటును ప్రభుత్వ సం స్థలు భర్తీ చేసినట్లయింది.

Updated Date - 2021-04-02T05:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising