ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది కాంగ్రెస్ నేర్పిన విద్యే: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2021-03-17T21:02:27+05:30

పెట్రోల్, డీజిల్‌పై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై కాంగ్రెస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ హాయంలో పెట్రోల్, డీజిల్‌పై టాక్స్ ఆ ప్రభుత్వం కూడా వసూలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఆదాయంలో ఇదొకటని అన్నారు. ఇది కూడా ‘మీరు నేర్పిన విద్యేనని, 40,45 ఏళ్లు మీరు వసూలు చేశారు.. ఇప్పుడు మేము వసూలు చేస్తున్నామని’ ముఖ్యమంత్రి అన్నారు. పెంచామని రాద్దాంతం చేస్తున్నారని, తాము ఒకసారే పెంచామని, అది కూడా స్వల్పంగా పెంచామని  సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అప్పుడు కాంగ్రెస్ హయాంలో 31, 33 శాతం ఉండేదని.. దాన్ని ఇప్పుడు 35 శాతానికి పెంచామన్నారు. ఇబ్బడిముబ్బడిగా పెంచి ప్రజలకు ఇబ్బందులకు గురిచేయలేదన్నారు. అయినా అది తమ చేతుల్లోలేదని, కేంద్రం పరిధిలో ఉందని, అందులో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వాటా మాత్రమే ఉందని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-17T21:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising