ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారు: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-11-10T20:47:47+05:30

సీఎం కేసీఆర్‌ వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 నెలలుగా కేంద్రమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోసం చూస్తున్నామని, కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలు ఇస్తామని ప్రకటించారు. ‘‘తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నియామకాలు మన చేతుల్లోకి వస్తాయన్నారు. నీళ్లు, నియామకాలు అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. ప్రాణహిత, చేవెళ్ల నిర్మిస్తే కమీషన్లు రావని రీడిజైన్‌ చేశారు. ప్రాజెక్టులపై వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? కాళేశ్వరం అవినీతి నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.

Updated Date - 2021-11-10T20:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising