ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ ఏడేళ్లకు ఇంట్లోంచి బయటకొచ్చారు

ABN, First Publish Date - 2021-06-28T08:43:35+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడేళ్లు ఇంట్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ అంబేడ్కర్‌ విగ్రహం ఏమైంది: బండి సంజయ్‌

కోనరావుపేట, జమ్మికుంట, జూన్‌ 27: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడేళ్లు ఇంట్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఆదివారం బండి సంజయ్‌ పర్యటించారు. సుద్దాలలో విలేకరులతో  మాట్లాడారు. దళితుల సాధికారతపై నిర్వహించినది అఖిల పక్ష సమావేశమా? ఎమ్మెల్యేల సమావేశమా? తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై కేసీఆర్‌ చెప్పేవన్నీ ప్రగల్బాలే అని మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. కేటీఆర్‌ అధికార దాహం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే కేటీఆర్‌ను హుజూరాబాద్‌లో పోటీకి నిలబెట్టాలన్నారు. జమ్మికుంటలో ఆయన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.


జయశంకర్‌ ఆశయ సాధనకు ఏకం కావాలి

 సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయ సాధన కోసం ఉద్యమకారులంతా ఏకం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో ఈటలను గెలిపించాలని శాసన మండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కోరారు. ఆదివారం మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ నివాసంలో ఉద్యమ నాయకులు సమావేశమయ్యారు. చంద్రబాబు మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌లో కేసీఆర్‌ ఏడిస్తే తాను ఓదార్చినట్లు గాదె ఇన్నయ్య పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-28T08:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising