ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ పాలనలో సంక్షేమ యుగం నడుస్తోంది: హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-09-12T00:17:30+05:30

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో సంక్షేమ యుగం నడుస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైల్వేలు, ఎల్‌ఐసీ, విమానశ్రాయాలు, నౌకాశ్రయాలు అమ్మి కుదవపెట్టి.. ఉద్యోగాలన్నీ ఊడగొడుతున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్‌ సంస్థల చేతిలోకి పోతే రిజర్వేషన్లు పోయి పిల్లల ఉద్యోగాలు ఊడుతాయన్నారు. బీజేపీ ప్రభుత్వం దొడ్డు బియ్యం కొనమని చెబుతున్నదని, దొడ్డు వడ్లు కొంటామని చెప్పినంకనే బీజేపీ ఓట్లు అడుగాలన్నారు. బీజేపీకి ఓటు వేస్తే గ్యాస్‌ ధర రూ. 1000నుంచి 1500 అవుతుందన్నారు. బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలో మనలాంటి సంక్షేమ పథకాలు లేవని తెలిపారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వాళ్ల సొంత పార్టీ నాయకులే డిమాండ్‌ చేస్తున్నారని హరీష్‌రావు గుర్తుచేశారు. 


Updated Date - 2021-09-12T00:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising