ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం 3 లక్షల ఇళ్లిస్తే .. కేసీఆర్‌ ఇచ్చింది 12 వేలు: బండి సంజయ్‌

ABN, First Publish Date - 2021-09-12T01:23:48+05:30

తెలంగాణలో ఇల్లు లేని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లను కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: తెలంగాణలో ఇల్లు లేని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లను కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. జోగిపేటలో శనివారం సాయంత్రం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి కేంద్రం లక్షల ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్రంలో కేసీఆర్‌ మాత్రం 12 వేల ఇళ్లు మాత్రమే నిర్మించారని ఆయన వివరించారు. ఫాంహౌస్‌, ప్రగతిభవన్‌కు పరిమితమైన కేసీఆర్‌ నిర్వాకం వల్ల రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు.  రాష్ట్రంలో ఉద్యోగులకు వాయిదాల పద్ధతిన జీతాలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల కోసం కేంద్రం రేషన్‌ బియ్యం పంపిస్తున్నదని, ఉచితంగా కరోనా టీకాలు మంజూరు చేసిందన్నారు. కేసీఆర్‌ మాత్రం ప్రజలకోసం ఏమీ చేయడం లేదన్నారు. కేసీఆర్‌ గడీల, కుటుంబ పాలనను బద్దలు కొట్టి 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సంజయ్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-12T01:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising