ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ కుల వృత్తులకు పూర్వ వైభవం తెస్తాం

ABN, First Publish Date - 2021-10-21T06:02:57+05:30

సీఎం కేసీఆర్‌ గ్రామీణ కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం

 రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

హుజూరాబాద్‌, అక్టోబరు 20: సీఎం కేసీఆర్‌ గ్రామీణ కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకులు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చి హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓట్లు అడగాలన్నారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ గెలిచి రెండున్నర ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు అభివృద్ధి కోసం నిధులు తీసుకురాలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుడికి టికెట్‌ ఇస్తే గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటి వరకు 1.14 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రవేశపెడితే, తన వల్లగానే ప్రవేశపెట్టారంటూ ఈటల వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. అన్ని శాఖల వారిగా ఖాళీల వివరాలను పంపించామని,  70 వేల ఉద్యోగాల భర్తీకి మరో మూడు నెలల్లో పూర్తవుతుందన్నారు. దళితబంధు పథకం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు లేదన్నారు. దళితబంధు పథకంలో 50శాతం భరించే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. కరోనా సంక్షోభంలో రైతులకు అండగా నిలిచి పంటలను కొనుగోలు చేసిన ప్రభుత్వం తెలంగాణ అన్నారు. ప్రజలు, అభివృద్ధిని గాలికి వదిలేసి బండి సంజయ్‌ తిరుగుతున్నాడన్నారు. నవంబరు 2తర్వాత ఈటల పరిస్థితి ఏంటోనని, ఆయన ఇక్కడ ఉండడన్నారు. సమావేశంలో ఎంపీ బండ ప్రకాష్‌, ఎమ్మెల్యే నోముల భరత్‌, ముదిరాజ్‌ నాయకులు, గొల్ల కురుమ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising