ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలి

ABN, First Publish Date - 2021-07-31T06:01:09+05:30

ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉత్తమమైన సేవలు అం దించడానికి కృషి చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, జూలై 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉత్తమమైన సేవలు అం దించడానికి కృషి చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మ హిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా 14 అంగన్‌ వాడీ టీచర్లు, 68 అంగన్‌ వాడీ ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, ధరఖాస్తు చేసుకు న్న అర్హులైన 6 అంగన్‌ వాడీ టీచర్లు, 18 అంగన్‌ వాడీ ఆయాలకు జి ల్లా కలెక్టర్‌ రవి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రవి మాట్లాడారు. స్వంత గ్రామాల్లో, స్వంత వార్డుల్లో తెలిసిన వారి మద్య ఉద్యోగం చేయడానికి అవకాశం రావడం గొప్ప వరంగా భావించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా శాఖా పరంగా ప్రభుత్వం చేపట్టే పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందజేయడంలో ముందుండాలన్నారు. విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చే యకుండా సక్రమంగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉత్తమమై సేవలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు, మహిళా, వయోవృ ద్ధుల సంక్షేమాధికారి నరేశ్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీధర్‌, ఐసీ డీఎస్‌ సీడీపీఓలు, సూపర్‌ వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T06:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising