ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇమిగ్రేషన్‌ చట్టాలపై అధ్యయనానికే వచ్చాం

ABN, First Publish Date - 2021-03-04T06:39:35+05:30

జగిత్యాల జిల్లాలో గల్ఫ్‌ వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని నెదర్లాండ్‌ డచ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఫౌండేషన్‌ ఎనోఎస్‌ వార్తా సంస్థ దక్షిణ ఆసియా ఢిల్లీ విలేఖరి అలెట్రా ఆండ్రే అన్నారు.

బాధిత కుటుంబం నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఆండ్రే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెదర్లాండ్‌ టీవీ జర్నలిస్ట్‌ అలెట్టా ఆండ్రే

జగిత్యాల అర్బన్‌, మార్చి 3:  జగిత్యాల జిల్లాలో గల్ఫ్‌ వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని నెదర్లాండ్‌ డచ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఫౌండేషన్‌ ఎనోఎస్‌ వార్తా సంస్థ దక్షిణ ఆసియా ఢిల్లీ విలేఖరి అలెట్రా ఆండ్రే అన్నారు. అందులో ఖతార్‌ కేంద్రంగా బాధిత కుటుంబాలలో ఇమిగ్రేషన్‌ చట్టాలు అమలైన విధానంపై అధ్యయనం చేసేందుకు జగిత్యాలకు వచ్చినట్లు ఆమె తెలిపారు. బుధవారం పీఎంఆర్‌ హోటల్‌లో జగిత్యాల ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరావు, మల్లారెడ్డి బృందం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఆండ్రే మాట్లాడుతూ నెదర్లాండ్‌ కేంద్రంగా ప్రపంచదేశాల్లో ఇమిగ్రేషన్‌ చట్టాలు అమలవు తున్న విధానంపై కొంతమంది కలిసి వివిధ దేశాల్లో అధ్యయనం చేస్తున్నామ న్నారు. అందులో భాగంగానే జగిత్యాల జిల్లాకు వచ్చామన్నారు. ఖత్తర్‌లో చనిపో యిన కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లెకు చెందిన కార్మికుడి కుటుంబాన్ని కలిసి వివరాలు సేకరించామన్నారు. అలాగే వలసకార్మికులపై కేంద్ర ప్రభుత్వ ప్రభావం ఏ విధంగా ఉందన్న అంశంపై కూడా పరిశీలన జరిపామన్నారు. గల్ఫ్‌ రిక్రూట్‌మెంట్‌ సెంటర్లలో ఏ విధంగా నియామక ప్రక్రియ కొనసాగుతుందన్న అంశంపై కూడా అధ్యయనం చేస్తామని అలెట్రా ఆండ్రే తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ సభ్యులు శ్రీధర్‌రావు, సిగిరి ప్రభాకర్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-03-04T06:39:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising